Sam Pitroda : దుమారం రేపుతున్న శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లో నెట్టిన ఆ వ్యాఖ్యలు ఏంటి?

Sam Pitroda : దుమారం రేపుతున్న శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లో నెట్టిన ఆ వ్యాఖ్యలు ఏంటి?

Sam Pitroda : ప్రస్తుతం దేశమంతా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి సంచలనమే అవుతున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయిన విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. చివరకు ఆయన తన పదవికే రాజీనామా చేసేంత వరకు వెళ్లింది. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు అంత దుమారం రేపాయి?

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

భారతీయులను శ్యామ్ పిట్రోడా వేరే దేశస్థులతో పోల్చారు. అదే ఆయన రాజీనామా చేసే వరకు తీసుకెళ్లింది. సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లా ఉంటారని శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. నార్త్ ఇండియన్స్ యూఎస్ వాళ్లలా ఉంటారని ఓ ఇంటర్వూలో తెలిపారు.

092 -2

అలాగే.. వెస్ట్ ఇండియాలో ఉండే వారు అరబ్బులని, ఈస్ట్ ఇండియాలో నివసించే వాళ్లు చైనీయులని వ్యాఖ్యానించారు శ్యామ్ పిట్రోడా. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలే ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాయి.  

Sam Pitroda : కాంగ్రెస్ పార్టీకి, శ్యామ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదు

అయితే.. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. వెంటనే శ్యామ్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఆయన చేసిన వ్యాఖ్యలకు, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చింది. 

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్.. శ్యామ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అలయెన్స్ పార్టీలు కూడా పిట్రోడా వ్యాఖ్యలను ఖండించాయి. శ్యామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా విరుచుకుపడ్డారు. ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. శ్యామ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. 

092 -3 F

సొంత పార్టీనే శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టడంతో చివరకు ఆయన తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది. వెంటనే శ్యామ్ రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదించినట్టు.. జైరామ్ రమేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మొత్తానికి శ్యామ్ చేసిన వ్యాఖ్యలకు, తమ పార్టీకి సంబంధం లేదని ఆయన రాజీనామాను కూడా ఆమోదించినట్టు చేతులు దులిపేసుకుంది కాంగ్రెస్ పార్టీ. 

సరిగ్గా లోక్ సభ ఎన్నికల వేళ శ్యామ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో బీజేపీ ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ పై విరుచుకుపడింది. ప్రధాని మోదీ కూడా రాహుల్ గాంధీపై విరుచుకుపడటంతో, విమర్శలు గుప్పించడంతో వెంటనే తేరుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆయన వ్యాఖ్యలకు, పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. 

ఏది ఏమైనా లోక్ సభ ఎన్నికల వేళ భారతీయులను వేరే దేశాల వాళ్లతో పోల్చుతూ శ్యామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం అయితే చేశాయనే చెప్పుకోవాలి. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?