Train tickets booking with QR code : రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త .. ఇకపై టికెట్లు తీసుకోవడం సులభం .. 

Train tickets booking with QR code : రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త .. ఇకపై టికెట్లు తీసుకోవడం సులభం .. 

Train tickets booking with QR code :  ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ఫోన్ పే, గూగుల్ పే వాడని వారు లేరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే ను వినియోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఫోన్ పే, గూగుల్ పే వలన చాలా లాభాలు ఉన్నాయి. ఫోన్ పే,గూగుల్ పే ద్వారా కూడా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అంతేకాక ఫోన్ పే,గూగుల్ పే ద్వారా ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. 2017లో కార్యకలాపాలు ప్రారంభించిన గూగుల్ పే అనతి కాలంలోనే టాప్ పేమెంట్ యాప్ స్థాయికి చేరింది.

ఇప్పుడు ప్రతి ఒక్కరు గూగుల్ పే ద్వారా లేక ఫోన్ పే ద్వారా ఎక్కువగా డబ్బులు చెల్లిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే రైల్వే నెట్వర్క్ లతో అతిపెద్దది అని చెప్పవచ్చు. ప్రతి నిత్యం లక్షల్లో, కోట్లలో ప్రజలు రైళ్లలలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కుటుంబంతో లేక స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెకేషన్ లకు పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రైళ్లు ఎంచుకుంటారు. వేసవి సెలవులు, పండగలు, వీకెండ్స్ వంటి సమయాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

దీనివల్ల చాలామంది ముందుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు..అయితే అకస్మాత్తుగా రైలు ప్రయాణం చేయాల్సి వస్తే అక్కడ స్టేషన్లో జనరల్ బుకింగ్ కౌంటర్ దగ్గరకు కు వెళ్లి టికెట్టు  తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మొత్తం డిజిటల్ పేమెంట్లు వచ్చిన సందర్భంలో దక్షిణ మధ్య రైల్వే కూడా తాజాగా ఒక శుభవార్త చెప్పింది. రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ప్రయాణికులకు నగదు చెల్లింపుల్లో ఇబ్బందులు కలగకుండా ఉండటానికి చెక్ పెట్టింది.

scan

 

సౌత్ సెంట్రల్ రైల్వే నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లను నగదు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయం గురించి దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ట్విట్టర్ X లో ప్రకటించింది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల ప్రయాణికులకు కౌంటర్ వద్ద ఎదురయ్యే చిల్లర కష్టాలు ఇకమీదట ఉండవు అని చెప్పింది..

 ప్లాట్ ఫామ్ టిక్కెట్లు, అన్ రిజర్వ్ డ్ టికెట్లు ఇప్పటికే రైల్వే స్టేషన్లో ఉన్న ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ లలో QR కోడ్ తో డబ్బులు చెల్లించే సౌలభ్యాన్ని రెండు సంవత్సరాల కిందటే దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనివల్ల కస్టమర్లు తమ సెల్ ఫోన్ లోనే యూపీఐ యాప్ ద్వారా ఏటివిఎం లోని QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తారు. కొత్తగా ఇప్పుడు UTS కౌంటర్ దగ్గర కూడా క్యూఆర్ సౌకర్యం తీసుకురాగా అన్ రిజర్వ్ డ్ టికెట్స్ కొనుగోలు మరింత సులభం అయ్యింది.

2021-24 మధ్య వెయిటింగ్ లిస్టులో ఉండే క్యాన్సిల్ అయినా టిక్కెట్ల వలన భారతీయ రైల్వేకు ఏకంగారూ.1230  ఆదాయం వచ్చినట్లు ఇటీవల స్పష్టం చేసింది. ఆర్టీఐ కి ఒక వ్యక్తి దరఖాస్తు చేయగా ఈ విషయం తెలిసింది. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రజలు వెయిటింగ్ లిస్టు ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అవుతాయని తెలిపింది. ట్రైన్ టిక్కెట్లు క్యాన్సిల్ అయినప్పుడు రైల్వే శాఖ వారు కస్టమర్లకు పూర్తి డబ్బులు చెల్లించారు. సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి వాటి పేరుతో కొంత మొత్తం కట్ చేస్తారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?