Supreem Court : న్యాయవాదులకు శిక్షణ ఎందుకు అవసరం లేదు?
ఈ సందర్భంగా జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. సమన్ల ఆదేశాలు లేక పోయినా ట్రయల్ కోర్టులోని ఓ న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేయడాన్ని సౌవిక్ తరఫు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులు తప్పు చేసినా బార్ కౌన్సిల్ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో న్యాయవాదులకు శిక్షణ ఉందని మన దేశంలోనే ఇంకా అమలులో లేదని తెలిపింది.న్యాయమూర్తుల కంటే న్యాయవాదులు ఎక్కువ కాదని గుర్తు చేసింది.
న్యాయమూర్తులు శిక్షణ తీసుకుంటే ప్రతిభ పెరుగుతుందే తప్ప ఎలాంటి నష్టం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.ఈ నేపథ్యంలో న్యాయమూర్తులకు శిక్షణ విషయంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి ప్రతి ఏడాది వేలాదిగా న్యాయవాద కోర్సులను పూర్తి చేసిన వారు అడ్వకేట్‌లు ప్రాక్టీస్ చేసేందుకు వస్తున్నారు. వీరి వల్ల న్యాయవాద వృత్తికి అవమానం జరుగుతుంది. లక్ష్యంతో పనిచేసే వారికి భంగపాటు తప్పడం లేదు. ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం కేంద్రం పట్టించుకుని ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడు న్యాయవాద వృత్తి, న్యాయవ్యవస్థపై సముచిత గౌరవం దక్కుతుంది.