ఏఐకెఎంఎస్ - ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో "బ్లాక్ డే"

నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన

ఏఐకెఎంఎస్ - ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో

నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 23 (క్విక్ టుడే) : అఖిల భారత రైతు- కూలీ సంఘం (AIKMS),అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఇచ్చిన "బ్లాక్ డే" పిలుపులో భాగంగా నల్ల క్లాత్ పట్టుకుని రాస్తారోకో నిర్వహించారునిర్వహించారు. ఈసందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్,అఖిల భారత రైతు- కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్) జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు మాట్లాడుతూ...దేశ సంపదను, సహజ వనరులను,ఆస్తులను ఆదానీ, అంబానీ లకు దోచిపెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వం, ఆరుకాలం రెక్కలను ముక్కలు చేసి కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదా అని ప్రశ్నించారు.

జై జవాన్, జై కిసాన్ నినాదాలు ఉత్త ముచ్చటేనా అని ఎద్దేవా చేశారు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే రైతు వెన్నులో తూటాలు దించిన హతక మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. రైతులపై కాల్పులకు అదేశాలిచ్చిన హర్యానా ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి,సీఎం, హోం మినిస్టర్ లపై హత్యానేరం కేసు నమోదు చేయాలని, విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 25 ఏండ్ల యువ రైతు శుభకరన్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వo బాధ్యత వహించాలని, దేశ ప్రజలకు మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. దేశంలో అన్నదాతలు అలాంటిస్తుంటే మోడీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయం అన్నారు.

వెంటనే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ (MSP) చట్టం చేయాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, కార్మిక కొత్త చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతు ఆగ్రహ జ్వాలలకు బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు. ఈ బ్లాక్ డే కార్యక్రమంలో PYL జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, IFTU పట్టణ ప్రధాన కార్యదర్శి కుంచం వెంకన్న, ఉపాధ్యక్షుడు కత్తుల చంద్రశేఖర్,అక్కినపల్లి అంజి,బొమ్మపాల అశోక్,లింగంపల్లి యాదయ్య, మాగి క్రాంతి కుమార్,స్వామి, ముత్తు,రాము,అశోక్, నాగరాజు,బోగరాజు రమేష్,బేజికంటే శంకర్,బాలాజీ నాయక్,బొమ్మిడి నగేష్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?