కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి

సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు తుమ్మల వీరారెడ్డి 

కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి


నల్లగొండ టౌన్. ఫిబ్రవరి 8 క్విక్ టుడే (ప్ర‌తినిధి) :  కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. గురువారం సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నెహ్రూగంజి హమాలి ఆఫీసు నుండి  తులసీ నగర్, పెదగడియారం, మైసయ్య సర్కిల్, ప్రకాశం బజార్ , ఎగ్బాల్ మినార్, అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్రం వివక్షపూరిత విధానాలు రాష్ట్రాల హక్కులపై దాడులకు వ్యతిరేకంగా సిఐటియు సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింద‌న్నారు. కేరళ ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అణిచివేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కేరళలో విపత్తులు, కష్టకాలంలో కూడా సహాయం చేయకుండా కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. ఎల్ డి ఎఫ్ ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆటంకాలు కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం ఆదాయం ఉత్పత్తి లో ముందంజలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన సంక్షోభం ఏర్పడిందన్నారు. 2021- 22 లో కేరళ రుణ పరిమితి తగ్గించిందని అన్నారు. జీఎస్టీ వంటి ఆదాయ వనరును తగ్గించిందని అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈడి, సిబిఐ, ఇన్‌క‌మ్ టాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలలో కేంద్రం జోక్యం చేసుకొని  దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ జోక్యం చేసుకొని మితిమీరి వ్యవహరించడం, ప్రభుత్వ పని విధానం పై  ప్రభావం పడుతుందని అన్నారు.

801విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం విద్విశ్ పూరిత వైఖరి అవలంబించడం సరికాదని ఇది మేధావులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వానికి ప్రజలకు సిఐటియు సంఘీభావంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆవురేష్ మారయ్య ,కోశాధికారి నాగరాజు, బక్కయ్య, వీరబాబు ,వెంకన్న, నాగరాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?