దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడాలి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున

నల్లగొండ పెద్ద గడియారం చౌరస్తాలో అర్థనగ్న ప్రదర్శన
మిగతా సంక్షేమ పథకాల లాగానే దళిత బంధును కొనసాగించాలి
నల్లగొండ. ఫిబ్రవరి 8 క్విక్ టుడే (ప్రతినిధి) : దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారులు పేదరిక రేఖకు దిగువన ఉన్న దళితులను దళిత బంధు పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్ తో గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత బందు బాధితులతో నల్లగొండ పెద్ద గడియారం చౌరస్తాలో పెద్ద ఎత్తున అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడగు నాగార్జున మాట్లాడుతూ దళిత బందుకు ఎంపిక కాబడిన లబ్ధిదారులకు గ్రౌండ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం జరిగిందని విడుదల చేసే నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని వారన్నారు.
నల్లగొండ నియోజకవర్గం లోని 1055 మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలి గౌరారం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 270 మంది ని దళిత బంధు పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని వారన్నారు. గ్రామ కార్యదర్శుల,ఎంపీడీవోల నల్లగొండ మునిసిపల్ అధికారుల సమక్షంలో ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినందువలన యధావిధిగా సాగాల్సిన గ్రౌండింగ్ ప్రక్రియ ఆగిపోయినది. ఎన్నికల కోడ్ ముగిసి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది. ఐనా మాకు రావాల్సిన దళిత బంధు నిధులను రీలిజ్ చేయలేదన్నారు..కావునా నిధులను మంజూరు చేయుటకు వేగవంతం గా గ్రౌండ్ చేసి జీవనోపాధి పొందుటకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేయాలని కోరారు.డిసెంబర్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే కొనసాగిస్తుందో అదే తరహలో దళిత బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను కొనసాగిస్తూ ఒక దళిత బంధు పథకం విషయమంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో స్పష్టం చేయాలన్నారు.