AIKMS : 24 న బీజేపీ ఎంపీల ఇండ్ల ముట్టడిని జయప్రదం చేయండి 

ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్

AIKMS : 24 న బీజేపీ ఎంపీల ఇండ్ల ముట్టడిని జయప్రదం చేయండి 

AIKMS : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 20 (క్విక్ టుడే ) : చండీగఢ్ లో రైతులతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా చర్చలు జరిపినా సఫలం కాలేదని, అఖిల భారత రైతు- కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎమ్.ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు. న‌ల్ల‌గొండ పట్టణంలోని సిపిఐ (ఎమ్ -ఎల్ ) న్యూడెమోక్రసీ కార్యాలయం (శ్రామిక భవనం)లో జరిగిన ఏ.ఐ.కే.ఎం.ఎస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం కోసం ఢిల్లీకి బయలుదేరిన రైతులను ఢిల్లీకి చేరుకోకుండా శివారు మార్గాలన్నింటిని మూసివేశారని అన్నారు.

ఢిల్లీలోకి వెళుతున్న రైతులపై మోడీ ప్రభుత్వ పోలీసులు క్రూరంగా లాఠీచార్జి జరిపి భాష్పా వాయువు ను ప్రయోగించారని దుయ్యబట్టారు. రైతుల ప్రధాన డిమాండ్  రైతులకు మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.  రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలని, విద్యుత్ ప్రైవేటికరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు. గత పోరాటాలలో చనిపోయిన రైతుకుటుంబాల‌ను ఆదుకోవాల‌ని, వారికి నష్టపరిహారం అందించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న కూడా రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తే పోలీసులు పాశవికంగా అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు.

వీటన్నిటిని నిరసిస్తూ మన వ్యవసాయాన్ని, రైతును, దేశాన్ని, ప్రజాస్వామిక రక్షణ కోసం ఈ నెల 24న బిజెపి ఎంపీల నియోజకవర్గం లో నిరసన ప్రదర్శనలో కాగడాల ప్రదర్శనలు చేయాలని ఎస్కేయం ఇచ్చిన పిలుపులో రైతులు, ప్రజాస్వామిక వాదులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం ( ఏఐకేఎంఎస్  ) జిల్లా అధ్యక్షులు జ్వాలా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు బిరెడ్డి సత్తిరెడ్డి, పజూరు ఉపేంద్ర, బొమ్మిడి నగేష్, ఇందూరు సాగర్, బీ.వి చారి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?