Itikala Ambedkar: ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్..
మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఇటికాల అంబేద్కర్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు కట్టలేని పేద విద్యార్ధులకు హాజరు శాతం లేదని, బకాయిల పేరుతో డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టి వసూలు చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. సదరు విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించకున్నా కూడా వారి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోనే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్ లైన్ లో హాల్ టికెట్స్ విద్యార్ధులకు అందుబాటులో ఉంచినట్లు, వీటిపై ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇతరత్రా వివరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెక్రటరీ వారు విడుదల చేసిన ఆర్డర్ కాపీని చూసి ఇంటర్మీడియెట్ అధికారులను సంప్రదించాలన్నారు. హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని ఇంటర్మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. అవసరమైతే బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ లీగల్ సెల్ 9866391076 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.