Burri Srinivasa Reddy : క్లాక్ టవర్ సెంటర్‌లో కేసీఆర్ మోసాలను వివరిస్తాం
-ఎల్ఈడి స్క్రీన్‌ల నల్లగొండ ప్రజలకు తెలియజేస్తాం
Burri Srinivasa Reddy : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 12 (క్విక్ టుడే) : కృష్ణా నది నుండి ఏపీకి నీటిని అందించింది కేసీఆర్ అన్న సంగతి అందరికీ తెలుసునని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఎందుకు పెడుతున్నారు వారికే అర్థం కావడం లేదని విమర్శించారు.
నల్లగొండ దత్తత తీసుకుంటాను అన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నల్లగొండలోని ఒక హైదరాబాద్ రోడ్డు ఒకటి మాత్రమే బాగు చేశారన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తదని వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇప్పటికే రెండు చేశామని మరొక రెండు నెలల్లో అన్ని అమలు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ . నాయకులు పాశం సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి ఇంతియాజ్,శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.