Dipsitathar : భేటీ బచావో..  బేటి పడావో‌.. దేశంలో నరేంద్ర మోడీ హటావో

ఎస్ ఎఫ్ ఐ ఆలిండియా గర్ల్స్ కార్యదర్శి దీప్సితాథార్

Dipsitathar : భేటీ బచావో..  బేటి పడావో‌.. దేశంలో నరేంద్ర మోడీ హటావో

నల్లగొండ, ఫిబ్రవరి 10 (క్విక్ టుడే) : భేటీ బచావో బేటి పడావో దేశంలో నరేంద్ర మోడీ హటావో అని ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా గర్ల్స్ కార్యదర్శి దీప్సితా థార్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా అఖిల భారత గర్ల్స్ కార్యదర్శి దీప్సితాదార్  హాజరై మాట్లాడారు.  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై వివక్షత రోజు రోజుకు పెరిగి పోతుంది. విద్యార్థులు, మహిళలపై అత్యాచారాలు చేసి మానభంగాలు చేసిన వారికి జైల్లో పెట్టకుండా ఇలాంటి వారికి జైలు నుండి విడుదలయ్యేటప్పుడు బిజెపి బ్రహ్మరథం పడుతుంది. నరేంద్ర మోడీ భేటీ పడావో బేటి బచావో అంటునే ఆడపిల్లలపై చెప్పరాని వివక్షత చూపుతున్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. దేశంలో ఉన్న వారందరూ ఇండియన్స్ అని చూడకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గా విభజించి మతతత్వ రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణ గడ్డ సాక్షిగా పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా ఉద్యమాల జిల్లా గా పేరు రావడం అంటే చాలా గొప్ప విశేషం అన్నారు. తుపాకి చేతపట్టి సాయుధ పోరాటం నడిపిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆత్మ సామర్థ్యం నింపేందుకు ఈ నల్లగొండ జిల్లా మీద ఈ బహిరంగ సభ ఉపయోగపడుతుందన్నారు. దేశంలో పేద మధ్యతరగతి  రైతులు  పిట్టల్లా రాలిపోతున్న రైతులను ఆదుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాల‌లు మూసివేస్తున్నారు. దళిత విద్యార్థులను విద్య దూరం చేయడమే దీనికి నిదర్శనం అన్నారు. బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలలో హిందూ, ముస్లిం  మతత్వ ప్రచారాలు విద్యా సంస్థలలో ప్రేరేపిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి  మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేసే విధంగా విద్యార్థుల పాఠ్యాంశాల‌లో చేర్చే  ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాతీయ విద్యా విధానం పూర్తిగా పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా‌ మారనుందన్నారు.

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి తాళ్ళ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో విద్యార్థినులు చాలా కాలంగా వారి హక్కుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఎస్ ఎఫ్ ఐ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే పరీక్షల సమయంలో నాణ్యమైన భోజనం పెట్టే విధంగా చూసి విద్యార్థినుల‌కు మేలు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం  ఆడుతున్నారు. విద్యార్థులను మానసిక వేదనకు గురి చేయడం జరుగుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూనే విద్యా రంగంలో బడ్జెట్ గొర్రె చందం లాగా పెట్టుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి  అధిక నిధులు కేటాయించి విద్య రంగంలో వస్తున్న సమస్యలపై సుదీర్ఘంగా ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన కమిటీ వేసి ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యారంగం పైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అందరి ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు తక్షణమే మెస్ చార్జీలు ‌విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి సావిత్రిబాయి, చాకలి ఐలమ్మల‌ స్ఫూర్తితో  విద్యార్థినులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ గర్ల్స్ కన్వీనర్ పూజ మమత నల్లగొండ జిల్లా గల్స్ కన్వీనర్ కావ్య, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ డీవైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్  ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ గర్ల్స్ నాయకురాలు రేణుక స్పందన ప్రసన్న మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు కోట్ల అశోక్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, శంకర్, బుడిగ వెంకటేష్, రమావత్ లక్ష్మణ్ సైదా నాయక్ కోరే రమేష్, సంపత్, వీరన్న, రవి, జగదీష్ శివ అంజలి, బిందు, మాధవి, దేవి, మౌనిక, ఐశ్వర్య, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?