Palla Venkata Reddy : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి14.(క్విక్ టుడే) ! గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉండి నల్లగొండ జిల్లా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ నిన్న జరిగిన బహిరంగ సభలో శుద్ధ అబద్ధాలు చెప్పాడని సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు పలా వెంకటరెడ్డి. అన్నారు.బుధవారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగినది.ఈ సమావేశంలో పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కరువు కాటకాలతో ఉన్న నల్గొండ జిల్లాకు పెండింగ్ ప్రాజెక్టుల కోసం దశాబ్దాల తరబడి ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాలు జరిగినాయి
ఆ సందర్భంగా ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లేముల ఉదయ సముద్రం నక్కలగండి ప్రాజెక్టు శంకుస్థాపన ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్ఎల్ బీసీ పక్కన పెట్టి కనీసం ఒక్క కిలోమీటర్స్ కూడా ఈ ప్రభుత్వము పూర్తి చేయలేదు. 2015లొ శంకుస్థాపన చేసిన చర్లగూడెం రిజర్వాయర్ కనీసం భూ నిర్వాసితులకు కూడా పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదు డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుండి నీరు తీసుకోవాలో కనీసం డి పి ఆర్ కూడా ఈ ప్రభుత్వము రూపొందించలేదు. నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగినది ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టానని ఊపగాంప్పుడు ఉపన్యాసాలు తప్ప ఈ పది సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు డిండి ఎత్తిపోతల పథకాన్ని అస్పష్టంగా తయారుచేసి సంవత్సరాలు తరబడి సాగు తాగునీరు ఇవ్వకుండా మునుగోడు దేవరకొండ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగినది
ఇవాళ మళ్లీ వచ్చి కేసీఆర్ నిన్న జరిగిన బహిరంగ సభలో శుద్ధ అబద్ధాలు మాట్లాడని తీవ్రంగా ఖండించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కేంద్రాల్లో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తూ దేశాన్ని కార్పొరేట్ వర్గాలకు అప్పజెప్తూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చెయ్యడాన్ని నిరసిస్తూ ఈనెల 16న జరుగు గ్రామీణ భారత్ బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఢిల్లీలో రైతులపై జరుగుతున్న దాడులను,అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పలా నరసింహారెడ్డి ఉజ్జిని యాదగిరి రావు పిదేవేందర్ రెడ్డి లోడంగి శ్రావణ్ కుమార్ బి వెంకటరమణ,పబ్బు విరస్వామి,ఆర్ అంజచారి,బంటు వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, గురిజ రామచంద్రం, టి వెంకటేశ్వర్లు, గిరి రమ,*లు పాల్గొన్నారు.