Komati Reddy Venkata Reddy : నల్లగొండ జిల్లాను కేసీఆర్ సర్వ నాశనం చేశారు

రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy : నల్లగొండ జిల్లాను కేసీఆర్ సర్వ నాశనం చేశారు


Komati Reddy Venkata Reddy : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 ( క్విక్ టుడే) :  నల్లగొండ జిల్లాకు కెసిఆర్ చేసింది ఏమీ లేదని, నల్లగొండ జిల్లాను సర్వనాశనం చేశార‌ని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆదివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బి ఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎస్ ఎల్ బి సి కి నిధులు కేటాయించకుండా ఏఎమ్ఆర్పి ఆధునీకరించకుండా నల్లగొండ జిల్లా ఎండబెట్టి, మళ్లీ ముసలి కన్నీరు కారుస్తూ నల్లగొండకు రావడానికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు.

అసెంబ్లీలో ఓట్ ఆర్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టామని, విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. గతంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వని రంగాలకు కూడా  నిధులు కేటాయించామన్నారు. ఎస్ ఎల్‌బీసీ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని విమర్శించారు. కెసిఆర్ మాట తప్పడం పై నల్లగొండ పట్టణంలో,సభ నిర్వహించే రోజు వినూత్న‌ నిరసన చేపడుతామన్నారు. కెసిఆర్ గతంలో ఎస్ఎల్బీసీ వద్ద కుర్చీ వేసుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఉపన్యాసాలు పోలీసుల అనుమతితో, ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా వినిపిస్తామన్నారు. కెసిఆర్,హరీష్ రావు, తారక రామారావులకు మాట్లాడే అర్హత లేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు, ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు.

10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బడ్జెట్లో 13% అంటే 37 వేల కోట్ల రూపాయలు అప్పులకే పోతున్నాయని దుయ్యబట్టారు. లక్ష కోట్లు పెట్టి పనికిరాని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. కాలేశ్వరం మేడిగడ్డ పై చర్చ వేదికలో అందరూ పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, పాశం  సంపత్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు రమేష్. తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?