నల్లగొండ జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 25 (క్విక్ టుడే) : కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండిపార్లమెంటు టికెట్ ఆశించే వారు ఆ షాపు చాలామంది ఉన్నప్పటికీ ఖచ్చితంగా టికెట్ వచ్చే అవకాశాలు కామరెడ్డి చంద్ర పవన్ రెడ్డికి మెండుగా ఉన్నాయి. భువనగిరి పార్లమెంట్ టికెట్ ఆశించే వారిలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కూతురు, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. పటేల్ రమేష్ రెడ్డిలు పోటీ పడుతున్నప్పటికీ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ప్రముఖ నాయకులు అయినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క పెద్ద అన్నయ్య రెండవ కుమారుడు కోమటిరెడ్డి చంద్రపవన్రెడ్డి , కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి విద్యార్థి దశ నుండే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేవారు.
యువజన కాంగ్రెస్ చంద్రపవన్రెడ్డి చురుకుగా పాల్గొనేవారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గెలుపుకోసం ఒక సాదరణ కార్యకర్తగా కష్టపడి పనిచేశాడు. స్వతహాగా కాంగ్రెస్ వీరాభిమాని, సోనాయా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలపై అమితమైన అభిమానంతో రాజకీయంపై మక్కువ ఏర్పడింది. 2010 తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో తెలంగాణ ఉద్యమంపై మక్కువ ఏర్పడి ఒక యువకుడిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తో పాటు చురుకుగా పాల్గొన్నాడు. 2011లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరుతూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ పట్టణంలో నవంబర్ 1, 2011 నుండి 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడై రాజకీయాల్లోకి రావాలని ధృడంగా నిర్ణయించుకున్నాడు.
నల్లగొండ పట్టణంలో యువత ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో నల్లగొండ యువతకు ఉద్యోగ కలపణ కల్పించాలనే సంకల్పంతో నాడు "పవన్ మోటార్స్" అనే సంస్థను ఏర్పాటు చేసి నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. 2011లో పవన్ మోటార్స్ ను నల్లగొండలో మొదటి బ్రాంచ్ను స్థాపించి పవన్ మోటార్స్ అధినేతగా అంచెలంచెలుగా ఎదిగి, నల్లగొండతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, చౌటుప్పల్, కొండమల్లేపల్లి, శేర్ లింగంపల్లి, లింగంపల్లి, మల్కాజ్గరి, సఫిల్గూడ, ఇబ్రహీంపట్నంలతో పాటు అనేక బ్రాంచ్లుగా విస్తరింప జేసి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు.