LV Yadav : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి
టీడీపీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి ఎల్వీ యాదవ్
On
నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 13(క్విక్ టుడే) : కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందున కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, ప్రైవేట్ పరం మానుకోవాలని టిడిపి నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి ఎల్వి యాదవ్ కోరారు. ఫిబ్రవరి 16 న నిర్వహించే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి ఎం ఏ రఫిక్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్ వి యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందున కార్మికులకు భద్రత లేకుండా పోయిందని కార్మికులకు నష్టం జరుగుతోందని సంస్థలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ.26 వేలు ఉన్నదాన్ని అని రంగాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలలో విస్తరించాలని అదేవిధంగా రైతాంగ పనులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...