Nalgonda : కోటి మందిని ప్ర‌త్య‌క్షంగా క‌లుస్తాం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి 

Nalgonda : కోటి మందిని ప్ర‌త్య‌క్షంగా క‌లుస్తాం

నల్లగొండ జిల్లాప్రతినిధి. ఫిబ్రవరి 27.(క్విక్ టుడే) : దేశ వ్యాప్తంగా కోటిమందిని ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వం సాధించిన విజయాలు తెలియజేస్తామ‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి అన్నారు. దేశం లో 400 సీట్ల సాధనే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టిందని ఆయ‌న తెలిపారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో  బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా విజయ సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించే ఈ యాత్ర నల్లగొండ లోక్ సభ పరిధిలో ఈ నెల 27న నల్లగొండ జిల్లా డిండి లో ప్రవేశిస్తుందాని అన్నారు. నల్లగొండ  పార్లమెంట్ పరిధిలో 3రోజుల పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతూ మార్చి1న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో సభ నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రలో  కేంద్ర, రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి కేంద్రంలో 3వ సారి బీజేపీ అధికారం చేపట్టడం తమ లక్ష్యమని అన్నారు..

అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు..  సీఎం రేవంత్ రెడీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధి విషయంలో చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చ కు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ విజయసంకల్పయాత్ర ప్రముఖ్ పోతేపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి చారి, జిల్లా కార్యదర్శులు పోతేపాక లింగస్వామి, మండల వెంకన్న, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ భవాని ప్రసాద్, మీడియా ఇంచార్జ్ పెరిక ముని కుమార్, పిన్నింటి నరేందర్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?