NSUI : కేసీఆర్ గో బ్యాక్... కేటీఆర్ బస్సుపై కోడి గుడ్లతో దాడి
On
NSUI: నల్లగొండ. ఫిబ్రవరి 13 (క్విక్ టుడే) : నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన సభతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ వాళ్లు ఏకంగా క్లాక్ టవర్ సెంటర్‌లో కుర్చీ వేసి దానిపై కేసీఆర్ ఫోటో పెట్టి ఎల్ఈడీ స్క్రీన్‌లో గత పది సంవత్సరాలుగా నల్లగొండకు చేసిన అన్యాయం మీద మాట తప్పిన అంశాల మీద ప్రసారం చేశారు. అలాగే కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ క్షమాపణలు చెప్పి సభ నిర్వహించాలి అని తెలిపిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత 2 గంటల నుంచి మాజీ సీఎం కేసీఆర్ సభ నల్లగొండలో ఉండటం వల్ల నల్లగొండ పట్టణంలోని గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు అలాగే మాజీ మంత్రులకి అలాగే మాజీ ఎమ్మెల్యే లకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు భోజనం ఏర్పాటు చేశారు. అది పూర్తి చేసుకుని సభా స్థలికి బస్సులో వెళ్తున్న సమయంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు హోటల్ మనోరమ ముందు శ్రీ లక్ష్మీ కాలనీ కి రాగానే ఒక్కసారిగా హఠాత్తుగా బస్సుకు అడ్డంగా వెళ్లారు. కేసీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్లటి దుస్తులు ధరించి కోడిగుడ్లతో దాడి చేశారు. అంతలో తేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఆందోళన కారులను స్టేషన్‌కు తరలించారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...