Paladugu Nagarjuna: ఎండిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున

Paladugu Nagarjuna: ఎండిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలి

Paladugu Nagarjuna: నల్లగొండ జిల్లా ప్రతినిధి, మార్చి 9 (క్విక్ టుడే) : ఎండిన పంటలు అంచనా వేసి ఎకరాకు 10.వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజీపేట, కంచనపల్లి, అనంతరం, కొత్తపల్లి, జి చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగుచేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో రైతులు నిబ్బరంగా ఉండాలని రైతులను కోరారు. ఇలాంటి విపత్కర సమయాలలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. నివారించడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే నష్టపోయిన పొలాలను పర్యవేక్షించిపంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు చూపుతో వ్యవహరించి ఎస్ఎల్బీసీ కాల్వకు నీళ్లు వదిలినట్లయితే ఎంతో కొంత భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉండడానికి దోహదపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతుల పంటలను త్వరగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ రైతులు పోషబోయిన యాదయ్య, దేప రామకృష్ణారెడ్డి, పోషవోని మల్లయ్య, కేతిపల్లి యాదయ్య, కల్లూరి రాములు, పోలే తానేష బకరం చిన్న, కాసర్ల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?