పీర్జాదిగూడ రామకృష్ణ నగర్ కాలనీలో రసవత్తర రాజకీయం
కాలనీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం పోటా పోటీ
- కార్పొరేటర్ భర్తతో ననబోలు రాజశేఖర్ రెడ్డి ఢీ
- నువ్వా.. నేనా? అన్నట్లు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్
- 19వ డివిజన్ కాలనీలో ఈ నెల 25న పోలింగ్
పీర్జాదిగూడ, క్విక్ టుడే : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్‌లోని రామకృష్ణ నగర్ కాలనీ అధ్యక్షపదవి ఎన్నిక రసవత్తరంగా మారింది. రామకృష్ణ నగర్ కాలనీలో గత సెప్టెంబర్ లో అధ్యక్ష పదవి గడువు ముగియగా గత కమిటీ వారు ఆలస్యం చేశారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో పోటీ తప్పలేదు. కాగా ఈ కాలనీ ఎన్నికల్లో ఇద్దరు నామినేషన్లు వేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఒకరు స్థానిక 19వ డివిజన్ కార్పొరేటర్ అలవాల సరిత భర్త అలవాల దేవేందర్ గౌడ్ పోటీ చేస్తుండగా మరొకరు కామన్ మ్యాన్ కాలనీకి చెందిన ననబోలు రాజశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. అయితే ఈ నెల 25వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ భర్తతో కామన్ మ్యాన్ పోటీకి దిగడం కాలనీలోనే కాకుండా కార్పొరేషన్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.
కాలనీలో వరదనీటి, మురుగునీటి సమస్యలను పెడచెవిన పెట్టారు. నాలుగున్నరేళ్లుగా చెరువుల్లో కనీసం గుర్రపు డెక్క అకును సైతం తొలగించక పోవడంతో దోమల బాధ పెరిగింది. దోమల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సాయంత్రం అయితే చాలు జనం ఇండ్ల నుంచి బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్ల నుంచి అధికారంలో ఉండి కూడా ఎలాంటి పనులు చేయనందున ఈ నెల 25న జరిగే కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో అలవాల దేవేందర్ గౌడ్ కు కాలనీవాసులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించాలి. ఎన్నికల్లో మర్రి చెట్టు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని కాలనీ వాసులను రాజశేఖర్ రెడ్డి వేడుకుంటున్నారు. కాలనీ పెద్దలు, మేధావులు, యువతీ యువకులు అంతా ఆలోచించి ఓటు వేసి మార్పును తీసుకురావాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాలనీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.