పట్టణంలో ఆగిన రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం
On
నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 27 (క్విక్ టుడే) : పట్టణంలో పెదగడియారం నుండి పెద్దబండ వరకు, డీఈఓ ఆఫీసు నుండి కలెక్టరేట్ వరకు ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం,సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు.
మంగళవారం సుందరయ్య భవన్ లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో ఎన్నికల సందర్భంగా ఆగిన రోడ్డు విస్తరణ పనులు తిరిగి చేపట్టకపోవడంతో రోడ్లపై కంకర, గుంటలు, దుమ్ము ధూళి డ్రైనేజీ నీటితో అస్తవ్యస్తంగా తయారై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే ఆగిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని కోరారు. మున్సిపాలిటీ వారు నిర్వాసితులకు టి డి ఆర్ ద్వారా నూతన భవన నిర్మాణ అనుమతులు ఎలాంటి ఫీజు లేకుండా ఇస్తామని చేసిన వాగ్దానం ఎక్కడా అమలు జరగలేదని అన్నారు. వెంటనే నిర్వాసితులకు టిడిఆర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నల్గొండ పట్టణంలో నిర్మించిన 552 డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర అసంపూర్తిగా ఉన్న రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్వాధీనపరచాలని కోరారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...