Learn English Google AI : ఇకపై ఇంగ్లీష్ నేర్చుకోవటం ఈజీ.. గూగుల్ కొత్త ఏఐ ఫీచర్ ఎలా వాడాలో తెలుసుకోండి..?

Learn English Google AI : ఇకపై ఇంగ్లీష్ నేర్చుకోవటం ఈజీ.. గూగుల్ కొత్త ఏఐ ఫీచర్ ఎలా వాడాలో తెలుసుకోండి..?

 

Learn English Google AI : ఈరోజుల్లో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ చాలా అవసరం. ఇతరులతో కమ్యూనికేట్ కావటానికి మంచి జాబ్ ఆఫర్స్ పొందేందుకు కీలకంగా మారింది. ఇప్పుడు ఇంగ్లీష్ ఫై పట్టు సాధించటానికి ప్రయత్నిస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్ ఉంది. టెక్ దిగ్గజాం గూగుల్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరచాలనుకునే ఆండ్రాయిడ్ వినియోగదారుల యూజర్ల కోసం సెర్చ్ పేజీలోనే కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది.

ఈ ఫిచర్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ కోసం అందుబాటులోకి వస్తుంది..ఇంగ్లీషులో అనర్గలంగా మాట్లాడాలి అని అనుకునే వారి కోసమే గూగుల్ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. దీంతో ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.. ప్రముఖ సెర్చింజన్ కంపెనీ గూగుల్ కొత్త ఫోన్ లో తీసుకువచ్చింది. ఇంగ్లీష్ లో మాట్లాడే  నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకున్న వారి కోసమే ఈ  ఫిచర్ ప్రవేశపెట్టింది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  ఆధారంగా స్పీకింగ్ ప్రాక్టీస్ పని చేస్తుంది. గూగుల్ సెర్చ్ ల్యాబ్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రయోగాత్మకంగా భారత్ సహా అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా,మెక్సికో, వెనిజులాలో దీన్ని తీసుకువచ్చింది. తరువాత ఎన్నో దేశాలకు ఇది విస్తరిస్తుంది. తెలుగు, తమిళం లాంటి ఎన్నో భాషలను జోడించాలి అని గూగుల్ కూడా ఆశిస్తుంది.

034 -3

గూగుల్ కంపెనీ కొత్తగా ప్రకటించిన ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ ఫిచర్ అనేది ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఒక ఆహ్లాదకరమైన, ఇంటరాక్టివ్ మార్గం. యూజర్లు ఆడ్రాయిండ్ ఫోన్ లలో పదాలు లేక వాక్యాలను ఇంగ్లీషులోకి లేక దాని నుండి మాతృభాషలోకి ట్రాన్స్ లేట్ చేయవచ్చు. రియల్ లైఫ్ ప్రాంప్ట్ లతో ఇంగ్లీష్ మాట్లాడే అవకాశాన్ని కూడా మీరు పొందవచ్చు..

ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ లో పాల్గొనాలి అంటే. గూగుల్ సెర్చ్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో ఎన్ రోల్ చేసుకోవలసిన అవసరం ఉంటుంది. దీనికోసమే ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ యాప్ ను ఓపెన్ చేసుకోవాలి. అందులో ల్యాబ్ సింబల్ పే క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఏఐ ఎక్స్ పరమెంట్ విభాగంలో స్పీకింగ్ ప్రాక్టీస్ కనిపిస్తుంది మీకు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి.

మీ ప్రాక్టీస్ ను మొదలు పెట్టుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ డివైజ్ లో ఇంగ్లీష్ నుండి  లేక ఇంగ్లీషులోకి ఏవైనా తర్జుమా చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ఫిచర్ మీకు దర్శనమిస్తుంది. ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ లో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు లేకుంటే టైప్ చేయొచ్చు కూడా. దానికి ఏఐ సమాధానాలు ఇస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో అది తెలియజేస్తుంది.

034 -1

దానికి ఫాలో ఆప్ ప్రశ్నలు కూడా ఉంటాయి. మనం ఇచ్చే ఇన్  పుట్ ను బట్టి అది సమాధానాలు ఇస్తుంది. ఇటీవల డ్యులింగో,బాబెల్ లాంటి లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిలో నేర్చుకునే వ్యక్తి స్థాయిని బట్టి పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. గూగుల్ లో మాత్రం అలాంటివి ఏమి లేదు. రోజు వారి సంభాషల ఆధారంగా కొత్తగా పాదాలు చేరుస్తూ ఇంగ్లీష్ మాట్లాడటంలో సహాయం చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు ఇంగ్లీష్ ను మెరుగ్గా నేర్చుకొని మరింత కాన్ఫిడెంట్ స్పీకర్స్ గా మార్చడానికి సహాయం చేయాలి అని అనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకునే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ యూజ్ ఫుల్ గా మరియు ఫాన్ గా ఉంటుంది అని గూగుల్ భావిస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో ఆసక్తి ఉన్న ఎంతోమంది పార్ట్ నర్స్ తో కలిసి పని చేయటానికి గూగుల్ సిద్ధంగా కూడా ఉన్నది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?