6G Network: 6 జి వచ్చేస్తుందోచ్.. ఇక నుండి బుల్లెట్ స్పీడ్ నెట్.. ఎప్పుడు అంటే? 

6G Network: 6 జి వచ్చేస్తుందోచ్.. ఇక నుండి బుల్లెట్ స్పీడ్ నెట్.. ఎప్పుడు అంటే? 

6G Network:  మన భారత దేశంలో ఇప్పటికే 5జి సేవలు అనేవి చిన్న గ్రామాల నుండి పట్టణాలు దాకా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ 5 జి ద్వారా ఇప్పటికే ప్రజలకు మరింత సులభంగా నెట్వర్క్ ఇబ్బంది అనేది లేకుండా  సాగుతున్నది మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ 5జి వచ్చిన తర్వాత 6జి కోసం కూడా మన భారతదేశం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.  టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్  (TSP) పై ఇటీవల ఏర్పాటు చేసిన  స్టేక్ హోల్డర్ అడ్వైజర్ కమిటీతో కమ్యూనికేషన్ల శాఖ మంత్రి  జ్యోతిరాధిత్య సింధియా మరియు డాక్టర్ పేమ్మసాని చంద్రశేఖర్  ఇటీవల రెండో సమావేశం ఏర్పాటు చేశారు.

6జి కోసం టెలికాం కంపెనీలు అయిన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోన్  వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపారు.   ఇప్పటికే దేశమంతా 5 సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. జియో మరియు ఎయిర్టెల్ పూర్తిగా అన్ని చోట్ల  5g నెట్వర్క్  అందుబాటులో ఉన్నది. మిగతా టెలికాం కంపెనీలైన ఐడియా,బిఎస్ఎన్ఎల్,వోడాఫోన్ లాంటివి  5 జి ని ఒక సంవత్సరంలోపు అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

 అయితే భారతదేశంలో 6 జి ని త్వరగా తీసుకొచ్చే సన్న హాలు చేస్తుంది. ఇలా 6 జి సేవలుని మనదేశంలో త్వరగా తీసుకు వస్తే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవచ్చని ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే అప్పుడప్పుడు ఈ టెలికాం సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. చర్చలే కాకుండా కచ్చితంగా 6జి సేవలను మన దేశంలో అందుబాటులోకి తీసుకురావాలని చాలా పట్టుదలతో కూడి ఉన్నదని ప్రభుత్వాలు తెలుపుతున్నాయి. 

25 -02

 గత శుక్రవారం నాడు టెలికాం సంస్థలతో చర్చలలో భాగంగా కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ చర్చలలో 6 జి సేవలను త్వరగా అందుబాటులో తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా ఈ మాటను ప్రధాన నరేంద్ర మోడీ స్వయంగా చెప్పుకొచ్చారని అన్నారు. ఈమధ్య జరిగినటువంటి భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భారతదేశం టెక్నాలజీ రంగాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని  స్వయంగా ప్రకటించారు.

దీంతో ఈ విషయం పైన మరింత క్రమశిక్షణతో పని చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 6జి సేవలు అనేవి భారతదేశంలో త్వరలోనే అందుబాటులోకి వస్తాయని విషయం తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 6 జి సేవల గురించి ప్రకటన చేసిన తర్వాత వెంటనే   మంత్రి జ్యోతిరాధిత్య  6జి ని ప్రారంభించడానికి తగినటువంటి జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

దేశంలో 6 జి ని ఎలాగైనా ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నట్లు మీడియా  లు తెలుపుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే టెలికాం ఆపరేటర్లతో జరిగిన సమావేశంలో రైట్  ఆఫ్ వే ను  సరళి కృతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దీంతోపాటుగా ఈ సమావేశంలో ఆపరేటర్లతో విద్యుత్ పై కూడా చార్జీల  భారం తగ్గాలని  డిమాండ్ చేశారు.

25 -03

 భారతదేశంలో 6 జి సేవలు అభివృద్ధి చేయడానికి అలాగే ప్రారంభించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. తద్వారా వేగంగా 6జి సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో  5జి సేవలు అందిస్తున్న ఏకైక దేశం మన భారతదేశం. ఇప్పుడు 6 జి సేవలను కూడా ప్రారంభించినట్లయితే  ప్రపంచంలోనే మొదటి స్థానం మన సొంతం అవుతుందని దీనివల్ల రికార్డ్ స్థాయిలో చరిత్ర సృష్టించగలమని అందరూ అంటున్నారు.

ఈ యొక్క 6 జి సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి  మన దేశ సాంకేతికతను ఉపయోగించ వలసి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే 6 జి సెమీ కండక్టర్ లను మన భారతదేశంలోని తయారు చేయాలనిభారత్ ప్రభుత్వం తెలిపింది.   ఇలా గనుక జరుగుతే భారతదేశ మరో ప్రపంచ చరిత్రను సృష్టిస్తుందని అనడంలో ఏమాత్రం అతిశయొక్తం లేదు. ఇప్పటికే గ్రామాల నుండి పట్టణాల వరకు ఎంతో మంది ఇంటర్నెట్ అనేది ఉపయోగిస్తున్నారు. 5 జి తో వేగంగానే ఇంటర్నెట్ను అందుకని సులభంగా పని చేసుకుంటున్నాం.

ఇక 6 జి ద్వార ఏమాత్రం కూడా టైం వేస్ట్ అవ్వదని తద్వారా ఈ పనినైన సులభంగా వెంటనే చేసుకోవచ్చు అని ప్రజలు అంటున్నారు. ఈ  6 జి సేవలు అనేవి మన భారతదేశంలో త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భారతదేశం తెలుపుతుంది. చూద్దాం మరి ఈ 6 జి సేవలను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందో.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?