కరెంటు లేకుండా పనిచేసే ఏసీ.. నిమిషంలో ఇల్లంతా కూల్ ..
On
ఈ సోలార్ ఏసీలు సూర్యరశ్మి నుండి సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చే శక్తి నుండి పనిచేస్తాయి. ఇలా చేయటం వల్ల కరెంటుబిల్లు తగ్గించవచ్చు. నిజానికి ఏసీలు అంటేనే చాలా కరెంట్ బిల్లు వస్తుంది. అంతేకాక దాని నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. సాంప్రదాయ ఏసీలు కంటే ఎక్కువ సోలార్ ఏసీలో పవర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ సాంప్రదాయ ఏసీలు ఎక్కువగా కరెంట్ తో మాత్రమే పని చేస్తాయి. అంతేకాకుండా మీరు సోలార్ బ్యాటరీ, సోలార్ పవర్,సోలార్ ఏసీలు ఉపయోగించుకోవచ్చు. సోలార్ ఏసీలు ఉపయోగిస్తే అప్పుడు మీరు దాని కోసం ఇంటి పై కప్పు పైన సోలార్ ఫ్యానెల్స్ అమర్చుకోవలసి ఉంటుంది. ఇంటిపై ఈ సోలార్ ఫ్యానెల్స్ అమర్చటం వల్ల సూర్యరశ్మి సహాయంతో మీ ఇల్లు రోజంతా చాలాచల్లగా ఉంటుంది. అంతేకాక కరెంటు బిల్లు కూడా సేవ్ చేయవచ్చు..
సోలార్ ప్యానెళ్లు పగలు మాత్రమే పని చేసినప్పటికీ పవర్ అనేది బ్యాటరీలో సేవ్ అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో బ్యాటరీ నుండి అదనపు కరెంటును ఉపయోగించుకోవచ్చు. ఈ సాంప్రదాయ ఏసీల వలన కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. మరి ఈ సోలార్ ఏసీలు కరెంటు తో కాకుండా సూర్యరశ్మితో పనిచేస్తాయి. దీనివలన విద్యుత్ బిల్లు గురించి చింత ఉండదు. సాంప్రదాయ ఏసీ కంటే సోలార్ ఏసీల ధర చాలా ఎక్కువ అయినప్పటికీ దాన్నిమీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీ కరెంట్ బిల్లు సున్న వస్తుంది. సోలార్ ఏసి ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఏసీకి కరెంటుతో పని ఉండదు. కాబట్టి విద్యుత్ బిల్లు గురించి టెన్షన్ ఉండదు. ఆటో స్టార్ట్ మోడ్,డ్రై మోడ్,స్లీప్ మోడ్,టర్బో కూల్ మోడ్, ఆన్-ఆప్ టైమర్, స్పీడ్ సెట్టింగ్, ఆటో క్లీన్,లవర్ స్టెప్ అడ్జస్ట్,గ్లో బటన్ వంటివి సాధారణ ఏసీ రిమోట్ లో ఉండే అన్ని ఫీచర్లు ఇది కలిగి ఉంటుంది.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...