Cooler, AC and Fan : కూలర్, ఏసీ నడిచేటప్పుడు ఫ్యాన్ వెయ్యవచ్చా...?
అయితే ఈ రెండు విధానాల్లో ఏది కరెక్ట్. కూలర్,ఏసీ లతోపాటు ఫ్యాన్ కూడా ఆన్ లో ఉంచినట్లయితే ఏం జరుగుతుంది. ఫ్యాన్ వేయటం వలన ఎలాంటి నష్టం జరుగుతుంది. ఇలాంటి సందేహాలు చాలామంది మదిలో మెదులుతూ ఉంటాయి. ఏసీ నడిచేటప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేయకూడదని చాలామంది అభిప్రాయపడతారు.
ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకునే అలవాటు ఉన్నవాళ్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఏసీ ఆన్ చేసినప్పుడు ఇలా ఫ్యాన్ వేయటం వలన ఎలాంటి నష్టలు జరగవు. లాభలే ఉన్నాయి.ఇలా ఫ్యాన్ వేసుకోవడం వలన ఏసీ గాలి రూమ్ మొత్తానికి తొందరగా వ్యాపిస్తుంది. అంతేకాక మీ గది తొందరగా చల్లబడేలా చేస్తుంది.
దీనివలన కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది అని నిపుణులు తెలిపారు.. మరోవైపు మీ గది త్వరగా చల్లబడటానికి కూలర్, ఫ్యాన్ ని ఒకేసారి నడపడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. కూలర్లు, సీలింగ్ ఫ్యాన్లు రెండు కూడా గాలిని ప్రసరింప చేయటానికి మాత్రమే పనిచేస్తాయి. కానీ అవి వ్యతిరేక దిశలో విస్తాయి. కావున ఈ రెండు పరికరాలు ఒకేసారి ఉపయోగించకూడదు.
సీలింగ్ ఫ్యాన్ పైనుండి గాలిని లాగితే, కూలర్ మాత్రం కింద నుండి గాలిని లాగుతుంది.ఈ రెండు డివైస్ లు ఒకేసారి నడిస్తే రెండిటి నుండి వచ్చే గాలి ఒకదానికొకటి ఢీకొంటాయి. కావున రెండిటిని ఒకేసారి నడపడం వలన వాటి వాయు ప్రవాహాన్ని నిరోధించేలా చేస్తాయి.
మీరు కోరుకున్నటువంటి చల్లదనాన్ని పొందలేరు. ఒక చిన్న గదిని పరిగణలోకి తీసుకొని కూలర్, ఫ్యాన్ రెండు ఒకేసారి నడుస్తున్నట్లయితే గాలి అసలు అందదు. ఎందుకు అనగా ఈ ప్రదేశంలో గాలి ప్రవాహం తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది అని తెలియజేశారు..