ఈ చిన్న ట్రిక్ తో వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను చదవచ్చు తెలుసా ..? 

ఈ చిన్న ట్రిక్ తో వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను చదవచ్చు తెలుసా ..? 

మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ వాడటం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ ఫోన్లో గల వాట్సాప్ లో ఎంతోమంది చాటింగ్ చేస్తూ ఉంటారు.  ప్రస్తుతం వాట్సాప్ కి ఎనలేని క్రేజ్ ఉంది. చిన్న వాళ్ల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. ఇక వాట్సాప్ కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ చాలా ఫీచర్లను పరిచయం చేసింది. అవన్నీ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఒక్కోసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఎదుటి వాళ్లు  చూడకుండానే డిలీట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒకరికి మెసేజ్ పెట్టబోయి మరొకరికి పెడుతుంటాము. ఈ క్రమంలో డిలీట్ అయిన మెసేజ్ లో ఏముంది అని  తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ అది కుదరదు కదా మరి డిలీట్ అయిన మెసేజ్ ను చదవడం ఎలా అని ఆలోచిస్తున్నారా. దీని కోసమే వాట్సప్ ఒక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని గురించి తెలుసుకుందాం..

 ఈ రోజుల్లో కమ్యూనికేషన్స్ చాలా సులువైంది. టెక్నాలజీ పెరగటం, వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్స్ అందుబాటులోకి రావటం వలన ఎంతో దూరంగా ఉన్న ఒకరినొకరు చాలా సులువుగా కనెక్ట్ అవుతున్నారు. వాట్సాప్ మనుషుల మధ్య ఉన్న బంధాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేస్తుంది. అందుకే ప్రస్తుతం వాట్సాప్ కి అంత క్రేజ్ ఉంది. ఇక వాట్సాప్ కూడా తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.  అంతేకాక వాట్సప్ ఎప్పటికప్పుడు ఒక సరి కొత్త ఫీచర్స్ మనకు అందుబాటులోకి తీసుకొని  వస్తుంది.యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగు పరిచేందుకు ప్రతినిత్యం సరికొత్త పీచర్లను అందిస్తున్న వాట్సప్ వినియోగదారులపై కూడా దృష్టి పెట్టింది. తాజాగా వాట్సాప్ ఒకరికి పంపబోయి మరొకరికి పంపిన మెసేజ్ డిలీట్ చేసే ఫీచర్ ను జోడించింది. 

 ఈ పీచర్ ద్వారా ఒకసారి పంపించిన మెసేజ్ ను తర్వాత డిలీట్ చేయవచ్చు. ఇంక డిలీట్  చేసిన మెసేజ్ ను ఎవరు  చూడలేరు. అయితే చాలామంది డిలీట్ చేసిన మెసేజ్ ను చదవాలని ఆత్రుతగా ఉంటుంది. అయితే డిలీట్ అయిన మెసేజ్ ను చదవడానికి అధికారిక మార్గం లేకపోయినా ఓ ట్రిక్ ద్వారా దీన్ని చదవచ్చు అని కొందరు చెబుతున్నారు. ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ లోకి వెళ్లాలి. అక్కడ ఒక నోటిఫికేషన్ హిస్టరీని పొందుతారు. దాని తర్వాత టోగుల్ ఆన్ చేసి డిలీట్ మెసేజ్ చదవచ్చు. మీ ఫోన్ కి వ‌చ్చిన  ఏదైనా నోటిఫికేషన్  24 గంటల పాటు దాని హిస్టరీ అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ ను డిలీట్ చేసినట్లయితే ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఫొటోస్, వీడియోస్ మాత్రం పొందలేరు అని చెబుతున్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?