whats App : వాట్సాప్ లో కొత్త ఫిచర్.. దీనివల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా...
కొత్తగా ప్రారంభించిన ఫిచర్ మోటా ఏఐ చాట్ బాట్ వాట్సాప్ ప్లాట్ ఫామ్ లో వాడటానికి అవకాశాన్ని తీసుకువస్తుంది. ప్రతి ఒక్కరికి ఉన్న స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా కనిపించే యాప్ లో ఇది కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు.
మోట తీసుకొచ్చినటువంటి ఈ ఏఐ సెర్చ్ టూల్ అచ్చంగా చాట్ జీపీటీలా పనిచేస్తుంది. రౌండ్ సింబల్ ను క్లిక్ చేసిన వెంటనే 'మోటా ఏఐ విత్ లామా 'అనే ఒక చాట్ పేజీ ఓపెన్ అవుతుంది.ఈ అడ్వాన్స్ డ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ తో ఎలాంటి ప్రశ్నలు అడిగిన ఇట్టే సమాధానాలు చెబుతుంది.
దీనిలో కొన్ని ప్రశ్నలు కూడా అదే సజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ చాట్ బాట్ కేవలం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అయితే ఇతర భాషలలో కూడా దీనిని అందిస్తారేమో చూద్దాం. ఇంతకీ బాట ఏఐ చాటింగ్ ఎలా చేయాలి అంటే.దినికోసం ముందు వాట్సప్ ఓపెన్ చేయగానే కనిపించిన రౌండ్ ఐ కాన్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత టార్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి.
ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ప్రాంప్ట్ ను ఎంచుకోవచ్చు లేక మీకు నచ్చిన సందేహాన్ని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సెండ్ బటన్ నొక్కిన వెంటనే ఏఐ మీతో చాటింగ్ చేస్తుంది. టెక్ట్స్, ఫోటోల రూపంలో ఏఐ మీకు సమాధానాలు చెబుతుంది. ఉదాహరణకు ఈ మ్యాజిక్ కార్ రేస్ ఆర్ మార్స్ అనే ప్రశ్నను ఇచ్చినట్లయితే.
నిజంగానే మార్స్ పై కార్ రేసింగ్ జరిగితే ఎలా ఉంటుందో అన్న ఫోటోలను ఏఐ వెంటనే మీకు పంపిస్తుంది. ఎడ్యుకేషన్ మొదలు హెల్త్ వరకు, టెక్నాలజీ నుండి సైన్స్ వరకు అన్ని రకాల ప్రశ్నలకు కూడా ఈ మోటా ఏఐ లో మీకు సమాధానాలు దొరుకుతాయి..