Earth danger : భూగోళం ముంగిట పేను ప్రమాదం..

Earth danger : భూగోళం ముంగిట పేను ప్రమాదం..

Earth danger : ప్రకృతి పరిరక్షణ మానవాళితోపాటుగా జీవరాశికి కూడా మనుగడ భద్రత అవసరం. కానీ మానవులు చెజేతుల భూమికి కలిగిస్తున్న నష్టంతో పలు రకాల రూపాలతో ముప్పు అనేది ముంచుకొస్తుంది. పర్యావరణ మార్పులను సమర్థంగా అధిగమిస్తూ భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. ప్రపంచ దేశాల్లో సహజ వనరుల వినియోగం అదుపు తప్పడం వలన భూమి నుండి విచ్చలవిడిగా ఖనిజాలు వెలికి తీయడం లాంటివి జరుగుతున్నాయి.

పెరుగుతున్న జనాభా అవసరాలతో పాటుగా అటవీ వనాల కోత వ్యవస్థ తీవ్ర  విద్వాంశంతో పర్యావరణ సమతుల్యం ఎంతగానో దెబ్బతింటుంది. మానవుని స్వయంకృతాపరదాల వల్ల తాగే నీరు దగ్గర నుండి పీల్చే గాలి,పండించే నెల వరకు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. భూగోళ పరిరక్షనే లక్ష్యంగా అవగాహన ముమ్మరం చేయటానికి ప్రపంచ దేశాలలో ధరిత్రీ దినోత్సవాలు కూడా జరుపుతున్నారు.

ఈ సంవత్సర ప్లాస్టిక్ వినియోగాల కారణంగా తలెత్తుతున్నటువంటి దుష్ప్ర భావాలు ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరాలపై ప్రచారాలను కూడా విస్తృతం చేయనున్నారు. ప్రతిరోజు వాతావరణ మార్పులలో దుష్ప్ర భావాలతో భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతతో తుఫానులు,వరదలు,కరువు కాటకాలు లాంటి ఎన్నో విపత్తులు మనపై దాడి చేస్తున్నాయి.

పరిశ్రమలు జనావాసాల నుండి విడుదలవుతున్నటువంటి కాలుష్య వ్యర్ధ జలాల్లో ఎక్కువ శాతం సముద్రంలో, నదులలో కలవడం వలన మన ఆరోగ్యాలపై దుష్ప్ర భావాలు చూపిస్తున్నాయి. గడిచిపోయినటువంటి 100 ఏళ్లలో సగం దాకా చిత్తడి నేలలు,పగడపు దిబ్బేలు మొత్తం అంతమయ్యాయి. పకృతి సమతుల్యత అనేది దెబ్బతినడంతో  కాలుష్యం కూడా ఎత్తగానే పెరిగిపోయింది.

235 -3

భూతాపాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు తీర్మానించిన దశాబ్దలు గడుస్తున్న కార్యాచరణ నోచుకోకపోవటం అనేది చాలా విచారకరం. భూతాపం పెరగటంతో ధ్రువ ప్రాంతాలలో ఉన్నటువంటి మంచుకొండలు వేగంగా కరిగిపోయి సముద్రమట్టాలు ఎంతో వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావాల వలన సముద్ర తీర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని కొన్ని అధ్యయనాలు తెలపటంతో ఎంతో ఆందోళన కలిగిస్తుంది..

ఈ సంవత్సరం ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు 2040నాటికి అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను 60 శాతం వరకు తగ్గించాలని తన లక్ష్యంగా పెట్టుకుంది. అమలులో చిత్త శుద్ధి కనబరిస్తేనే మెరుగైన ఫలితాలు అనేవి దక్కుతాయి. కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం అనేది పకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.

ప్రజల సాంకేతిక పరిజ్ఞానం జీవనశైలిలో వచ్చినటువంటి మార్పుల వలన ప్లాస్టిక్ వినియోగం అనేది ఊహించని విధంగా పెరిగిపోతుంది. పలు రకాల ప్లాస్టిక్ వినియోగం, ఉత్పత్తులపై నిషేధం నియంత్రణ అమలు ఒక సవాలుగా మారింది. ఈ భోగోళంపై ప్రతి సంవత్సరం 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రాలలో పేర్కొని పకృతి వ్యవస్థలు జలచరాలు ప్రజల ఆరోగ్యం పైన దుష్ప్రభావాలు ఎంతగానో చూపిస్తున్నాయి.

భారత్ లో ప్రధాన నదులు, ఉపనదులు 20 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో విడిచె వాహకాలుగా మారటం వలన పరిస్థితి  తీవ్రతకు  అద్దం  పడుతుంది.ఇప్పుడు ప్లాస్టిక్ ఉత్పత్తి పునర్వినియోగం విధానాలలో సత్వర మార్పులు చోటు చేసుకోకపోతే మరొక పది సంవత్సరాల్లో 30 కోట్ల టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రాల పోగుపడే ప్రమాదాలు ఉన్నాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు మరింత ప్రమాదకరంగా మారాయి.

235 -4

వీటి ఉత్పాదకత నుండి వినియోగం వరకు కూడా విధిస్తున్నటువంటి నిషేధం చిత్తశుద్ధితో జరగాలి.ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యవస్థల బలోపేతానికి ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను చాలా వేగంగా తగ్గించి పదార్థాల అన్వేషణ పరిశోధనపై దృష్టి పట్టాల్సిన అవసరం ఉన్నది. భూగోళానికి పొంచిన అనర్థాలు నియంత్రించటానికి  పర్యావరణం హితకరమైన విధానాల అమలతో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది..

పారిస్ ఒప్పందంలో భాగంగా కార్బన ఉద్గరాల నియంత్రణపై ఇచ్చినటువంటి హామీల అమలపై కార్యాచరణ ఎంతో వేగవంతం చేయాలి. సంపన్న దేశాలు వెనుకబడిన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలోని ప్రజలు ఆహార భద్రత,ఆరోగ్య పరిరక్షణకు ఎంతో బాధ్యత వహించాలి. దేశాలన్నీ కూడా డీజిల్,పెట్రోల్, బొగ్గు లాంటి శిలాజ  ఇందనాల వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక ఇందన  వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.

అడవుల కోతకు కూడా అడ్డుకట్ట వేయాలి.కార్చిచ్చులను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. అడవుల కోత కాలుష్యం లాంటి అంశాల్లో  వివిధ రకాల పర్యావరణ విధానాలు చట్టాల ప్రతిష్ట అమలకు పూనుకోవాలి. ప్రభుత్వ వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలి. అడవులను అటవీకి సంబంధించిన కార్యక్రమాలను బదలాయిస్తూ ప్రత్యామ్నాయంగా  చేపట్టినటువంటి వనాల పెంపకం చిత్తశుద్ధితో జరగాలి.

అకస్మాత్తుగా వస్తున్నటువంటి వరదలతో చెన్నై,ముంబై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలు సైతం జలమయం అవుతున్నాయి.కొన్ని నగరాలు మాత్రం ప్రతిరోజు నీటి సమస్యలను ఎదుర్కొంటుంది. దేశంలోనే పెద్ద నగరాలకు సంబంధించినటువంటి వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళికలను రూపొందించి అమలు చేయకపోవడం వలన ఈ తరహా దుర్భర పరిస్థితులు పెరుగుతున్నాయి అనే వాస్తవాన్ని గుర్తించాలి.

235 -5

పర్యావరణం, వాతావరణ మార్పులు, చిత్తడి, తీర ప్రాంతాలు,మడ అడవుల పరిరక్షణ లాంటి సున్నితమైన పర్యావరణ అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా,రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి.ప్రజల జీవనశైలి పర్యావరణానికి అనుకూలంగా సాగేలా నీరు, విద్యుత్,ఇంధనం,కనిజం ఇతర వనరుల వినియోగం లో పొదుపు ఎంతో అవసరం.

ధరిత్రీ పరిరక్షణలో అందరూ కూడా భాగస్వాములే. భావితరాల మనుగడకు జీవన భద్రతకు ఎంతో భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అడవులపై జీవ వైవిధ్యాన్ని రక్షించటంలో అడవుల పాత్ర ఎంతో కీలకమైనది.కర్బర ఉద్గరాలను గ్రహించటం వలన వాతావరణ మార్పులు దుష్ప్ర భావాలను తగ్గించేందుకు ఎంతో దోహదం చేస్తాయి.

అటవీ వానరుల సేకరణ వలన కొన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎంతో ఉపాధి హామీ కల్పిస్తున్నాయి. ఎంతో వేగంగా సాగిపోతున్న ఈ నగరాల విస్తీరణ, ఖనిజ తవ్వకాలు, ఉష్ణోగ్రత పెరుగుదల,కార్చిచ్చులు లాంటివి అడవుల రక్షణకు ఎంతో సవాల్ గా మారాయి.

అడవులు నశించటం వలన అరుదైన జీవుల మనుగడ సైతం ప్రమాదంలో పడతాయి. భారత్ లో అటవీ వానాల పరిరక్షణ పెంచడానికి కృషి చేస్తున్న కార్యాచరణలో మాత్రం ఎటువంటి చిత్తశుద్ధి కనబడటం లేదు అని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?