Aadhaar XML : ఆఫ్ లైన్ ఆధార్ XML ప్ర‌యోజ‌నాలు అంద‌రూ తెలుసుకోవాల్సిందే..

Aadhaar XML : ఆఫ్ లైన్ ఆధార్ XML ప్ర‌యోజ‌నాలు అంద‌రూ తెలుసుకోవాల్సిందే..

Aadhaar XML : భారతదేశంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగానికి చెందిన ఎలాంటి పని జరగాలన్న ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు లేనిదే ఏ పని కూడా పూర్తి కాదు. అయితే ఇది మొన్నటి వరకు ఉన్న మాట కానీ ఇప్పుడు ఆధార్ ఒకటి ఉంటే సరిపోదు. దాంతోపాటు తప్పనిసరిగా కేవైసీ చేసుకొని ఉండాలి.

అంతేకాక ప్రస్తుతం కేవైసీ చేసుకోవడం ఆన్ లైన్ లో చాలా సులువుగా అయిపోతుంది. ఒకవేళ మీరు దీనిని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మీ సమీప ప్రాంతంలో గల బ్యాంక్ , పోస్ట్ ఆఫీస్ లేదా ఆధార్ కేంద్రాలలో కూడా అప్డేట్ చేయించుకోవచ్చు. అయితే ఇటీవల ఆన్ లైన్ లో ఈ-కేవైసీ  చేసుకునేందుకు అధికారులు XML ప్రవేశ పెట్టడం జరిగింది.

ఇక ఈ కార్డు గురించి ఎవరికి తెలియదు కానీ అసలు ఈ కార్డు ఎందుకు ప్రవేశపెట్టారు..? దీని వలన మనకు కలిగే ఉపయోగాలు ఏంటి..? దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..? దీనికి సంబంధించిన‌ పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఇక్క‌డ తెలుసుకుందాం..

091 -2
ఆఫ్ లైన్ ఆధార్ XML అంటే..

ఇది ఒక సెక్యూర్డ్ డాక్యుమెంట్.. దీనిని మీరు ఎక్కడైనా షేర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అంతేకాక దీనిలో మీ ఆధార్ కార్డుకు సంబంధించి వ్యక్తిగత డిజిటల్ సంతకం కూడా ఉంటుంది. ఇక ఈ కార్డులో మీ యొక్క పేరు అడ్రస్, ఫోటో , లింగం, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. అయితే ఈ వివరాలన్నీ కూడా బేస్ 64 ఎన్ కోడ్ ఫార్మేట్ లో ఉంటాయి. 

ఫోన్ లో ఎలా డౌన్లోడ్ చేయాలి...

ఈ XML కార్డు కోసం మీరు ధ్రువీకరణ చేసుకోవాలనుకుంటే ఆధార్ నెంబర్ లేకుండా ఆఫ్ లైన్ లో  కూడా చేసుకోవచ్చు. కాబట్టి దీనిని మీరు ఫోన్ లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. UIDAI అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

అయితే దీనికోసం ముందుగా మీరు మీ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి https://uidai.gov.in/offline-ekyc వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత స్క్రీన్ పై ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ ను మీ యొక్క ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అప్పుడు మీయొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ లు ఓటిపి వస్తుంది. 

ఈ ఓటీపీ ద్వారా మీరు XML ఓపెన్ చేయవచ్చు. పక్కనే డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు మీ యొక్క డిజిటల్ సంతకంతో కూడిన ఆఫ్ లైన్  ఆధార్ XML ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

091 -3

ఉపయోగాలు...

ఈ కార్డు ద్వారా ఈవైసీ చేయించుకోవడం చాలా సులభతరం అవుతుంది. అంతేకాక మీరు ఈ కార్డును సర్వీస్ ప్రొవైడర్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది జనాభా సమాచారం కూడా కలిగి ఉండటం వలన ప్రమాణీకరణ కూడా చాలా సులభం అవుతుంది. ఇక్కడ మరో ప్రయోజనం ఏంటంటే మీరు ఈ XML ఫైల్ ని సర్వీస్ ప్రొవైడర్ ను కలవకుండా కూడా షేర్ చేసుకోవచ్చు.

అంతేకాక ఇది సెక్యూరిటీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మీకు మరింత భద్రత కల్పిస్తుంది. ఎందుకంటే ఇది మీ ఆధార్ నెంబర్ ను మరియు మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కావున మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?