Google videos deleted : 22 లక్షల వీడియోలు డిలీట్... ఇండియన్ యూట్యూబర్లకు షాక్ ఇచ్చిన గూగుల్...
నిజానికి యూట్యూబ్ 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక సమర్పించగా. ఈ నివేదికలో యూట్యూబ్ తన ప్లాట్ ఫామ్ నుండి ప్రపంచంలో ఎన్నో దేశాల నుండి వీడియోలను తీసి వేసినట్లుగా ప్రకటించింది. అయితే వీటిలో అత్యధిక సంఖ్యలో ఇండియన్ వీడియోలు ఎక్కువగా ఉన్నాయి.
సింగపూర్ కు చెందిన 12,43,871 వీడియోలు యూట్యూబ్ తొలగించింది. ఇవి మాత్రమే కాదు యూట్యూబ్ మాతృ దేశమైన అమెరికా కూడా మూడో స్థానంలో ఉంది. అమెరికా నుండి అప్ లోడ్ అయినటువంటి7,88,354 వీడియోల కంపెనీ తీసివేసింది.
అంతేకాక సుమారుగా 52 లక్షల వీడియోలు యూట్యూబ్ గుర్తించింది. ప్రభుత్వ సంస్థలు మాత్రం నాలుగు వీడియోలు మాత్రమే గుర్తించింది. 51.15% వీడియోలు జీరో వ్యూస్ కలిగి ఉండగా 26.43% వీడియోలు0-10 విక్షణలను కలిగి ఉన్నాయి. కేవలం1.25% వీడియోలు మాత్రం 10,000 కన్నా ఎక్కువ వ్యూస్ కలిగి ఉన్నట్లుగా కంపెనీ తెలిపింది..
యూట్యూబ్ తన ప్లాట్ ఫామ్ నుండి ఈ వీడియోలను తీసివేయటానికి గల కారణాలను కూడా వివరించింది. యూట్యూబ్ లో విడుదల చేసిన నివేదిక లో 39.4% వీడియోలు ప్రమాదకరమైనవి లేక హానికరమైనవిగా గుర్తించింది. 32.4% వీడియోలను మాత్రం పిల్లలకు భద్రత కారణంగా తొలగించింది. 7.5% అశ్లీలమైనవిగా లేక హింసాత్మకంగా ఉన్నట్లు గుర్తించింది.
వీడియోలను తొలగించడానికి గల కారణాలలో న్యూ డీటీ, సెక్సువల్ కంటెంట్, హింస, బెదిరింపులు, వేధింపులు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించటం వంటి అనేక కారణాలు కూడా ఉన్నాయి. వీడియోలు తొలగించటమే కాదు యూట్యూబ్ తన ప్లాట్ ఫామ్ నుండి మొత్తం 2,05,92,341 ఛానేల్ కూడా తొలగించింది.
వాటిలో 92.8% ఛానల్ స్పామ్, మోస పూరిత కంటెంట్ లేక తప్పుదారి పట్టించే విధంగా ఉండటం వల్ల వీటిని తీసేశారు. అలాంటి టైంలో న్యూ డిటీ లేక సెక్సువల్ కంటెంట్ కారణం వలన 4.5% తప్పుడు సమాచారాన్ని అందించినందుకు 0.9% చానెల్ ను తీసివేశారు..