whats App : మిమ్మల్ని వాట్సాప్ లో ఎవరైనా బ్లాక్ చేశారా...? అయితే ఇలా చెక్ చేసుకోండి...
మీరు కూడా అలా స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటారు కదూ. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారంతా వాట్సప్ ఉపయోగిస్తారు. రోజులో కనీసం ఒక్కసారైనా వాట్సప్ చూడని వారు ఉండరు. మరి మీరు కూడా రోజు వాట్సప్ ఉపయోగిస్తారు కదా.వాట్సప్ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో ఉపయోగించే అవకాశం కూడా ఉంది. తెలుగులో మాత్రమే కాదు మీకు నచ్చిన భాషలో వాట్సాప్ ఉపయోగించవచ్చు. వాట్సప్ మాత్రమే కాదు ఏ యాప్ నైనా ఉపయోగించడానికి కొన్ని సెట్టింగ్స్ ఉపయోగపడతాయి.
ఇప్పుడు వాట్సప్ కమ్యూనికేషన్ కి ప్రధాన సాధనంగా మారింది. ఫోటోలు పంపడం దగ్గర్నుంచి సందేశాలు పంపడం వరకు ప్రతి ఒక్కటి వాట్సాప్ లో జరుగుతాయి. వీడియో కాల్ చేయటం ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా కమ్యూనికేషన్ చెయ్యటం సాధ్యమవుతుంది.. ఫోన్ లొ వాట్సాప్ ద్వారా చాటింగ్ చాలా వేగంగా చేయవచ్చు. కానీ వెబ్ లో మాత్రం చాలా తక్కువ సౌకర్యం ఉంటుంది.
వాట్సాప్ లొ ప్రొఫైల్ పిక్చర్ కింద యాక్టివిటీ స్టేటస్ కనిపిస్తుంది. దానివల్ల మీరు ఆన్ లైన్ లొ మీ అప్డేట్స్ చెప్పుకోవచ్చు. అంతేకాక ఇతరుల అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా కొంతమంది స్టేటస్ మీకు కనిపించదు. దానికి ఒక కారణం ఉంటుంది. ఎవరైనా మీ వాట్సాప్ నెంబర్ ని బ్లాక్ చేసినట్లయితే మీరు వాళ్లకి వాట్సాప్ లొ వాయిస్ కాల్ గాని వీడియో కాల్ గాని చేయటం కుదరదు. వాట్సాప్ లో మీ నెంబర్ బ్లాక్ చేసినప్పుడు మీ మెసేజ్ లు వారికి డెలివరీ అవ్వవు.వాటి పక్కనే మీకు ఒక టిక్ కనిపిస్తుంది.
మిమ్మల్ని ఎవరైనా వాట్సప్ లొ బ్లాక్ చేస్తే ఆ వ్యక్తి పెట్టిన స్టేటస్ గాని అప్డేట్ గాని మీకు కనిపించవు. వారికి సంబంధించిన సమాచారం ఏది కూడా మీకు కనిపించదు. మిమ్మల్ని వారు బ్లాక్ చేస్తే వారిని మీరు గ్రూప్ లో చేర్చలేరు. ఇలా మీకు జరిగినట్లయితే మిమ్మల్ని వారు వాట్సాప్ నుంచి బ్లాక్ చేశారని అర్థం చేసుకోండి..