మనం ఉన్న ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఈ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మన ముందు ఉంటే చాలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోము. దీనికంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటం సహజం. మనం ఫోన్ లొ గేమ్స్ ఆడకపోయినా, సినిమా చూడకపోయినా ఫొటోస్ మాత్రం తీస్తుంటాము. ప్రతిచోట జరిగే సందర్భాన్ని వీడియోలు తీస్తూ ఉంటాము. తీసిన ఫొటోస్, వీడియోస్ ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. అయితే అప్పుడప్పుడు మనకు తెలియకుండానే ఫోన్లో గల ఫొటోస్, వీడియోస్ డిలీట్ అవుతాయి. డిలీట్ అయిన ఫొటోస్, వీడియోస్ మళ్లీ రావు. కనుక ఎంతో బాధపడతాము. ఇలా అనుకోకుండా డిలీట్ అయిన ఫోటోలు గాని వీడియోలు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిలీటెడ్ ఫోటోలు, వీడియోలు రికవరీ చేసుకోవటానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయంట. మరి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ నుండి మనం ఏమైనా ఫోటోలు డిలీట్ చేస్తే అవి ఆటోమేటిక్ గా ట్రాష్ ఫోల్డర్ లోకి వెళ్తాయి. బ్యాకప్ చేసి డిలీట్ చేసిన ఫోటోలు 60 రోజుల దాకా ట్రాష్ సెక్షన్ లోనే ఉంటాయి. ఆన్ బ్యాక్ ఫోటోలు 30 రోజులు వరకు ఉంటాయి. వీడియోలు ఫోటోలు ట్రాష్ ఫోల్డర్ లో ఉంటే వాటిని రీస్టోర్ చెయ్యటం కుదురుతుంది. ఈ వీడియోలు, ఫోటోలు ట్రాష్ ఫోల్డర్ లో లేనట్లయితే వాటిని రికవరీ చేయటం కుదరదు. అవి ట్రాష్ ఫోల్డర్ ఎంప్టీ చేసినట్లయితే దానికి సంబంధించిన కంటెంట్ ను తిరిగి పొందటానికి అవకాశం ఉండదు. గూగుల్ సపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం..ఒక యూజర్ గనుక 2సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాలు గూగుల్ ఫొటోస్ లో ఇనాక్టివ్ గా ఉన్నట్లయితే డిలీట్ అయిన ఫోటోలు రీస్టోర్ చేయటం కుదరదు. రెండు సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ కాలం మీ స్టోరేజ్ లిమిట్ ఎక్సీడ్ అయ్యి ఉన్నట్లయితే ఫోటోలతో పాటు కంటెంట్ మొత్తం డిలీట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కంటెంట్ అనేది పెర్మనెంట్ గా కూడా డిలీట్ అయ్యే అవకాశంఉంది.
గూగుల్ ఫోటోలు డిలీట్ చేసిన ఫోటోలను తిరిగి పొందటానికి ఆర్కెవ్ పోల్డర్ ను వాడాలి. కొన్ని సందర్భాల్లో ఫోటోలు మనకు తెలియకుండానే ఆర్కేవ్ అవుతూ ఉంటాయి. మొదటగా ఆర్కేవ్ ఫోల్డర్ లో చెక్ చేసుకోవాలి. ఫోటోలను రీస్టోర్ చేసుకోవటానికి ఆన్ ఆర్కేవ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత ట్రాష్ ఫోల్డర్ ను వాడాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్ యాప్ లో ట్రాష్ ఫోల్డర్ ను ఓపెన్ చేయాలి. తర్వాత రిజిస్టర్ చేయాలనుకున్న ఫోటోలను సెలెక్ట్ చేసుకోండి. రీస్టోర్ ఆప్షన్ పే క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటోలను గ్యాలరీ కి లేక గూగుల్ ఫొటోస్ లైబ్రరీకి తీసుకొని రావచ్చు. దీనిలో గల గూగుల్ సపోర్ట్ ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఫోటోలు గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అయినట్లయితే ఫోటోలు ఎందుకు రిజిస్టర్ చేయాలనుకున్నారో వాటికి సంబంధించిన వివరాలు హెల్ప్ పెజ్ ద్వారా రిక్వెస్ట్ పంపాలి. అప్పుడే గూగుల్ మీకు హెల్ప్ చేస్తుంది. దీనికి గూగుల్ డ్రైవ్ కి వెళ్లి హెల్ప్ పేజ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిస్సింగ్ ఆర్ డిలీటెడ్ ఫైల్స్ ఆప్షన్ మళ్ళీక్లిక్ చేయాలి. ఇప్పుడు పాప్ -అప్ బాక్స్ లో రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది రిక్వెస్ట్ చార్ట్, రెండోది ఇమెయిల్ స్టోర్ నచ్చిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు ఫొటోస్ ఫైల్స్ మీరు ఎందుకు రీస్టోర్ చేయాలనుకుంటున్నారో వివరించాల్సి ఉంటుంది. ఇలా గనుక చేసినట్లయితే డిలీట్ అయిన ఫొటోస్, వీడియోస్ మళ్లీ మీకు చేరతాయి.