Inverter Usage : ఇన్వర్టర్ ను ఉపయోగించే వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే...

Inverter Usage : ఇన్వర్టర్ ను ఉపయోగించే వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే...

Inverter Usage : ప్రస్తుతం మనం ఉన్న ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో కూడా ఇన్వర్టర్ల ను వాడుతున్నారు. ఒకప్పుడైతే పెద్ద హాస్పటల్ లో లేక షాపింగ్ మాల్స్ లో మరియు థియేటర్లలో పవర్ బ్యాకప్ కోసం జనరేటర్లను ఉపయోగించేవారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఇండ్లలో పవర్ బ్యాకప్ కోసం ఇన్వర్టర్ ను వాడుతున్నారు.

దీనివలన పవర్ కట్ అయిన టైంలో ఇంటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తుంది  కాబట్టి. ఇన్వర్టర్ కనెక్షన్ తో ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్,LED బల్బు,టీవీ, ఫ్రిడ్జ్ లాంటి అవసరమైన విద్యుత్తు ఉపకరాలకు ఉపయోగించవచ్చు. మీ ఇంట్లో కూడా ఇన్వర్టర్లు ఉంటే దాని ఉపయోగం కోసం కొన్ని చిట్కాలను మీరు కచ్చితంగా పాటించాలి.

ఎందుకు అంటే. మీకు ఇన్వర్టర్ యూజింగ్ తెలియకుండా దాని ఉపయోగించినట్లయితే దాని జీవితకాలం అనేది తొందరగా తగ్గిపోతుంది. అంతేకాక ఇన్వర్టర్ ఉపయోగిస్తున్న విద్యుత్  ఉపకారాలు కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

134 -2

ఇన్వర్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇన్వర్టర్ ను చక్కగా ఉపయోగించినట్లయితే  ఆ బ్యాటరీ ఎక్కువ కాలం పని చేస్తుంది. లేదంటే బ్యాటరీ దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున బ్యాటరీ చెడిపోతే కొన్ని సార్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంట్లో ఇన్వర్టర్ ని ఉపయోగించే ముందు మీ ఇన్వర్టర్ ఎన్ని వాట్స్ లో ఉన్నదో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.

మీ ఇన్వర్టర్ ఒక కిలో వాట్ అనగా 1000 వాట్స్ ఉన్నట్లయితే మీరు పవర్ కట్ అయిన టైంలో ఇన్వర్టర్ పవర్డు ఎక్విప్ మెంట్ 1000 వాట్ల కంటే తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయటం వలన మీ ఇన్వర్టర్ బ్యాటరీ  లైఫ్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఇండ్లలో ఇన్వర్టర్ ను సరఫరా చేసే మెయిన్ వైర్ పై MCB ఉపయోగించరు.

దీనివలన షార్ట్ సర్క్యూట్ జరిగితే పవర్ ఆఫ్ కాకపోవటమే కాక ఇన్వర్టర్ పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇన్వర్టర్ పవర్ సరఫరా చేసే ప్రధాన వైరు పై MCB ని ఇన్స్టాల్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అయితే వెంటనే విద్యుత్ సరఫరా అనేది  ఆగిపోతుంది..

134 -3

ఇన్వర్టర్ బ్యాటరీ లో ఎప్పటికప్పుడు డిస్టిల్డ్ వాటర్ నింపుతూనే ఉండాలి. ఎందుకు అంటే. నీరు ఆవిరైపోతే బ్యాటరీ దెబ్బతింటుంది. అంతేకాక అగ్ని ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇన్వర్టర్ వాడటంతో నీటి స్థాయి కూడా తగ్గుతుంది. ఇన్వర్టర్ ను వాడేవారు ప్రతి 45 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్వర్టర్ బ్యాటరీ ని పూరించేందుకు డిస్టిల్డ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి.

కొళాయి నీరు లేక ఆర్ఓ ద్వారా శుద్ధి చేసినటువంటి నీరుని తీసుకోవటం వలన బ్యాటరీ ని దెబ్బతీసే మలినాలు లేక ఖనిజాలు ఉంటాయి. అందుకె డిజిటల్ వాటర్ ఇన్వర్టర్ ఫిల్ చేయాలి. వేసవికాలంలో అయితే ఈ ఇన్వర్టర్ బ్యాటరీ లో ఉండే నీరు తొందరగా అయిపోతుంది. ఇన్వర్టర్  బ్యాటరీ లోకి నీరు నింపే టైం లో గ్రీన్ గుర్తుల మధ్య నీటి స్థాయి వరకు ఉంచటం చాలా అవసరం. నీటి స్థాయి తక్కువ కాకుండా చూసుకోవాలి. లేకపోతే బ్యాటరీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

అధిక నీటి స్థాయిలో బ్యాటరీ యాసిడ్ లు పలుచగా చేస్తాయి. అవి కూడా బ్యాటరీ పనితీరును తగ్గిస్తాయి. గ్రీన్ సిగ్నల్ ను సరిచూసుకొని నీటిని ఫిట్ చేసుకోవడం చాలా అవసరం. ఇన్వర్టర్ బ్యాటరీ లో నీటిని నింపటమే కాకుండా ఇన్వర్టర్ వైరింగ్ ను కూడా క్షుణంగా చెక్ చేసుకోవాలి. నీరు నింపే  టైం లో ఇన్వర్టర్ బ్యాటరీ లో తక్కువ నీటి స్థాయికి సంబంధించిన సంకేతం పై శ్రద్ధ వహించాలి. గుర్తు తెలియనట్లయితే  బ్యాటరీలో డిజిటల్ వాటర్ పోసేందుకు వెంటనే సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదించండి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?