Luggage Problems in Car : మీరు కారు లో ఎక్కువ లగేజీ తీసుకెళుతున్నారా... అయితే సమస్యలు తప్పవు...
చాలామంది కొత్తగా కారు కొనాలి అని అనుకునేవారు తన కారులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండాలి అని ఆశిస్తారు. ప్రత్యేకించి ఫ్యామిలీ అవసరాలకు అనుకూలంగా కొనుగోలు చేసే కారు లో లగేజీ ఎక్కువగా తీసుకెళ్లేందుకు ఎక్కువగా బూట్ స్పేస్ ఉండేలా చూసుకుంటారు.
మీ కారులో బూట్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే లగేజ్ ల సంఖ్య కూడా తక్కువగా తీసుకువెళ్లాలి అనే అభిప్రాయాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ముఖ్యంగా CNG కారులో అతి పెద్ద సమస్య బూట్ స్పేస్ అనేది పరిమితంగా ఉండటమే CNG కార్లలో CNG సిలిండర్ కారు యొక్క బూట్ స్పేస్ ప్రాంతంలో ఉంటుంది.
కావున అక్కడ వస్తువులను నిల్వ చేయడానికి తగినంత స్థలం అనేది ఉండదు. దీనివలన ఆయా కార్లలో బోట్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ కారు వెనక ఉన్నటువంటి భాగాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో చాలా మందికి అవగాహన అనేది లేదు. తక్కువ స్థలంలో కూడా ఎక్కువ వస్తువులలో సులభంగా స్టోర్ చేసుకోవచ్చు.
కారు యొక్క బూట్ స్పెస్ ఆటో మేకర్లు లీటర్ల సామర్థ్యంలో పరిగణిస్తారు. ఉదాహరణకు 400 లీటర్లు, 450 లీటర్లు, 500 లీటర్లు ఎలా బూట్ కెపాసిటీని కారుకు సంబంధించిన వివరాలు ప్రచురిస్తారు. కానీ 400 లీటర్లు, 500 లీటర్లు స్థలాన్ని ఎలా కొలుస్తారు అని అడిగితే మాత్రం దానిని నిరూపించటం చాలా కష్టం. అయితే వాహనంలో మనం ఎంత లగేజీని పెట్టగలము అనే దాని గురించి ఇది మనకు ఒక అవగాహన అనేది కల్పిస్తుంది.
మీరు గనక కారు బూట్ స్పేస్ లో సామాను పెట్టినప్పుడు మీరు వెనక డోర్ మిర్రర్ కింద ఎత్తు వరకు లేక వెనుక సీటు ఎత్తు వరకు లగేజీని పెట్టుకోవచ్చు.. మీరు కారులో ఈ ఎత్తుకు మించి సామాను పెట్టకూడదు. ఈ ఎత్తు దాటి మీరు లెగేజీ ని నింపినట్లైతే రియల్ వ్యూ గ్లాస్ ద్వారా తగినంత బిజీబిజీని పొందటం అసాధ్యం అవుతుంది.
అంతేకాక ఇది కారు భద్రత కూడా ముప్పు కలిగిస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ లగేజీని సీటు కంటే ఎత్తుగా లేక వెనుక విండో గ్లాస్ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇది రియల్ రివ్యూ మిర్రర్ ను కవర్ చేసేందుకు కాకుండా కారు వేగంగా వెళ్లేందుకు లగేజీలు వెనుక సీటుపై పడే అవకాశాలు ఉంటుంది.
ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఈ సమస్యలను నివారించేందుకు ఆటోమేకర్లు కూడా ఈ సూచనలు చేస్తున్నారు. కానీ చాలా మందికి దీనిపై సరైన అవగాహన అనేది లేదు. కావున మీరు ఈసారి కారులో ప్రయాణం చేసేటప్పుడు లగేజ్ ను సీట్ పై పడకుండా కారు బూట్ ప్రాంతంలో మాత్రం లగేజ్ ని స్టోర్ చేసేలా చూసుకోవడం చాలా మంచిది.
అంతేకాక ఎంత లగేజ్ ని ఎలా ఉపయోగించవచ్చు అనే దానిపై తనిఖీ చేసుకోవాలి. అంతకుమించి లగేజీ తీసుకెళ్లడం కూడా రోడ్డుపై భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అని గమనించాలి..