Samsung unveils Galaxy Ring: మార్కెట్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్.. దీని ధర, ఫీచర్ల తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
తాజాగా సాంసంగ్ కంపెనీ ఎలక్ట్రానిక్ స్మార్ట్ రింగుని విడుదల చేసింది. ఇందులో ఎన్నో రకాలుగా మనుషులకు సంబంధించి అలాగే మనుషుల యొక్క హెల్త్ కు సంబంధించి చాలా ఫీచర్స్ ఏ ఉన్నాయి. ఈ రింగును చూసి చాలా మంది కూడా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు మనం భారతదేశంలో అయితేఇలాంటి స్మార్ట్ రింగ్ అనేది ఎప్పుడు కూడా చూసి ఉండం. అలాంటిది తాజాగా samsung స్మార్ట్ రింగును విడుదల చేసింది. ఇలాంటి రింగు మీరు కనుక నిజంగా చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అవును మీరు విన్నది నిజమే.
అయితే ఈ స్మార్ట్ రింగ్ అనేది ఎంతో స్టైలిష్ గా అలాగే చాలామంది ప్రజలు వీటిని ఇష్టపడేలా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ స్మార్ట్ రింగ్ అనేది ఉపయోగపడుతుందని సాంసంగ్ కంపెనీ వాళ్ళు చెప్పుకొచ్చారు. యూజర్లు ఎక్కువగా వాడడానికి స్టైలిష్ డివైస్ తొ అలాగే మంచి డిజైన్తో వీటిని తయారు చేశారు. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం గోల్డ్ కలర్లలో వీటిని డిజైన్ చేశారు.
ఇక ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్ ఫీచర్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ స్మార్టు రింగులో చాలా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక ఈ స్మార్ట్ రింగులో మనం ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్రపోతూ ఉన్నాం, హార్ట్ రేట్ ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా ఇది ట్రాక్ చేస్తుందట. అంతేకాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీలను కూడా ఇది గుర్తు చేస్తుందట. అలాగే ఈ స్మార్ట్ రింగు ఎంతసేపు నీటిలో ఉంచిన సరే ఇది పాడవదట.
ఈ రింగు ని 100 మీటర్ల నీటిలో లోతులో ఉంచిన సరే కొంచెం కూడా చెక్కుచెదరదట. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ పవర్ గురించి. ఈ బ్యాటరీ 18 ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ స్మార్ట్ రింగుకి ఒకసారి చార్జింగ్ పెడితే ఏకంగా ఆరు రోజులు పాటు వస్తుందని ఈ కంపెనీ తెలిపింది. ఇందులోనే మరో ప్రత్యేకత ఉంది. ఈ స్మార్ట్ రింగు వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉందట. అంతేకాకుండా ఈ రింగ్ ఫాస్ట్ గా ఛార్జ్ కూడా అవుతుందని ఈ కంపెనీ తెలిపింది.
ఈ సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగును ఏఐతో రూపొందించారు కాబట్టి మానవుడికి హెల్త్ కు సంబంధించి ప్రతి ఒక్క విషయంలోనూ ఇది గుర్తించిన రికార్డు చూపిస్తుంది. అలాగే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి దీనికి సాంసంగ్ హెల్త్ అనే యాప్ తో సంబంధం ఉంటుందని చెప్పి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ రింగ్ ఉన్నవాళ్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇటు చూసినా సరే ఈ వాచ్ నీ కొనడానికి చాలామంది పెద్దవాళ్లు మొగ్గు చూపుతున్నారు.
ఎందుకంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు పెద్దవాళ్లలో వస్తాయి కాబట్టి ఎక్కువగా పెద్దవాళ్ళు స్మార్ట్ రింగును కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. చరిత్ర సృష్టించేలా సాంసంగ్ కంపెనీ సంచలనాత్మక త్రిబుల్ ఫోల్డ్ సామ్సంగ్ మొబైల్ ను అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇది త్వరలోనే విడుదల చేసేటటువంటి అవకాశం ఉందట. ఇక కొన్ని నెలల్లోనే ఈ త్రిబుల్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ అనేది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని సామ్సంగ్ కంపెనీ నిర్వహికులు చెప్పారు.