Smart Phone heat : స్మార్ట్ ఫోన్ వేడెక్కుతుందా..ఇలా చల్లబరచండి..
ఓవర్ గా చార్జింగ్ కావడం వలన లేక మూసివేసిన వేడి గదిలో ఫోను చార్జ్ చేయటం ఇలాంటి ఏవైనా కారణాల వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. సమస్య ఏది అయినప్పటికీ కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఇది ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బ్యాటరీ లైఫ్, ఫోన్ పనితీరును కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీరు ఫోన్ లో గేమ్ ఆడినప్పుడు లేక ఏదైనా యాప్ ని ఉపయోగించినప్పుడు లేక సినిమా చూసినప్పుడు ఫోన్ కు నిరంతరం దాని CPU,GPU నుండి చాలా ప్రపోజింగ్ పవర్స్ అవసరం అవుతాయి. ఈ పరిస్థితుల్లో ఫోన్ ఆపరేట్ చేస్తూ ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టినట్లయితే మీరు మీ డివైస్ ని దాని పరిమితిని నెట్టివేసి, థర్మల్ ఓవర్ లోడ్ కు గుర అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో మల్టీ టాస్క్ కింగ్ కు బదులుగా బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ను ఛార్జ్ చేయాలి. మీరు మీ బ్యాటరీ చార్జ్ చేసేందుకు థర్డ్ పార్టీ చార్జర్ లేక కేబులు ఉపయోగిస్తే ఫోన్ కు హాని కలిగించే ప్రమాదాలు ఉన్నాయి. డూప్లికేట్ చార్జర్ వల్ల కూడా ఫోన్ కి ఛార్జింగ్ సరిగా జరగదు.
మీ ఫోన్ యొక్క అంతర్గత భాగాలకు గాలి ఎంతో అవసరం. చార్జింగ్ చేసేటప్పుడు మీ డివైస్ లో తగినంత స్పేస్ లేక వెంటిలేషన్ లేకపోతే అంతర్గత భాగాల ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన వేడి బాడీ నుండి తప్పించుకోలేక పోతుంది. దీని ఫలితంగా ఫోన్ హీట్ ట్రాప్ ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫోన్ చుట్టూ కూడా గాలి ప్రసరణకు తగ్గినంత స్థలం ఉండేలా చూసుకోవాలి.
చార్జింగ్ చేస్తున్నప్పుడు ఐఫోన్ లో దాని కేసు నుండి తీసివేయమని ఆపిల్ స్వయంగా సిఫారస్సు చేసింది. ఫోన్ వేడెక్కటం లాంటి సమస్యలు నివారించడానికి కొన్ని సాధారణ పద్ధతులు ఇవి. అయితే పైన చెప్పిన పద్ధతుల ద్వారా పరిష్కారం కాకపోతే దానిని అనుసరించొద్దు. మీరు వెంటనే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి లేక నేరుగా కంపెనీని సంప్రదించండి..