Reduced air pollution in hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం.. దానికి కారణం ఇదే ...
ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం కూడా. హైదరాబాద్ భారత దేశంలో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి. అంతేకాక సాఫ్ట్ వేర్ రంగంలో కూడా ఇది ఎంతగానో అభివృద్ధి చెందింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ మహానగరంలో వాయు కాలుష్యం ఎక్కువ. హైదరాబాదులో ఇప్పటికే వాయు కాలుష్యం పెరిగిపోయిందని మరో ఢిల్లీ అయ్యే అవకాశం ఉందని పలు సంస్థలు భయపెట్టాయి.
హైదరాబాద్ వాసులకు ఊపిరి పీల్చుకునే ఒక వాస్తవం వినిపిస్తుంది. దుమ్ము, కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే నగరవాసులకు ఒక ఊరటం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది అని ఓ అంతర్జాతీయ సంస్థ తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం వివిధ నగరాల్లో వాయు కాలుష్యం పై స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉన్న ఐక్యూ ఎయిర్ సంస్థ ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించింది.
ఆ అధ్యయనం ప్రకారం హైదరాబాద్ తో పాటు శివార్లలోని సంగారెడ్డి, పారిశ్రామిక సంస్థలు ఉన్న పటాన్ చెరువులో కూడా వాయు కాలుష్యం గతంతో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా తగ్గినట్టు నివేదికలో పేర్కొంది. ఐక్యు ఎయిర్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం..హైదరాబాదులో 2019-20లో పీఎం-10,101 ఉండగా, 2022- 23 లో 87గా నమోదయింది, అయితే 2023 24 సంవత్సరంలో 83 గా నమోదయినట్లు ఈ సంస్థ తెలిపింది.
నగరంతో పాటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కూడా వాయు కాలుష్యం గత సంవత్సరంతో పోలిస్తే చాలావరకు తగ్గిందని ఈ సంస్థ తెలిపింది. ఇంకో వైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ GHMC పరిధిలో వాయు కాలుష్య రహదారి దుమ్ము 32 శాతం, వాహనాల కాలుష్యం 18 శాతంగా ఉంది అని ఈ నివేదిక తెలిపింది.
అంతేకాక నగరాల్లో ఈ భారీ మార్పులకు కారణాలు ఏమిటి అనగా GHMC పరిధిలోTS, RTC బస్సులు డీజిల్ కి బదులుగా వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగిస్తున్నారు. ప్రధాన రహదారులు దాటేందుకు పాదాచారులు ఉపయోగించడానికి ట్రాఫిక్ ఫెలికాల్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశాటం,ట్రాఫిక్ ను బట్టి ఆటోమేటిక్ గా మారే అడాప్టింగ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం.ఈ ప్రధాన కారణాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.