Cealing Fan Speed : తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్... సింపుల్ గా స్పీడ్ పెంచుకోవచ్చు ఇలా...
బ్లేడ్లను శుభ్రం చేసే ముందు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి. దాని తర్వాత ఫ్యాన్ బ్లేడ్లను పొడుగుడ్డుతో శుభ్రంగా తుడవాలి. తర్వాత తడి గుడ్డతో కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు ఫ్యాన్ బ్లేడ్లను తడి గుడ్డుతో శుభ్రం చేస్తే దుమ్మంతా బ్లేడ్ లకు అంటుకుంటుంది అని గుర్తుంచుకోండి. వాటిని సరిగ్గా శుభ్రం చేయటం సాధ్యం కాని పని..

ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవటం కూడా అంత సులువైన పనేమీ కాదు.ఎంత శుభ్రం చేసిన కూడా దుమ్ము,దూళి అనేది వస్తూనే ఉంటుంది. మరోవైపు పండగలు,ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొన్ని వస్తువులను శుభ్రం చేయటం మనకు ఉన్న అలవాటు. అందువల్ల రోజు రోజుకి చెత్త మరింతగా పెరిగిపోతుంది. వేసవిలో ఫ్యాన్ స్పీడ్ గా తిరగాలి అనుకుంటే దానిని బాగా శుభ్రం చేసుకోండి.
మనం రోజు కూడా వీటిని శుభ్రం చేయలేము. క్లీనింగ్ అనేది ప్రత్యేక రోజులలో మాత్రమే చేస్తాము. అందువలన అది దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. వాటిని వెంటనే తొలగించాలంటే చాలా కష్టం. డస్ట్ సీలింగ్ ఫ్యాన్ వెనిగర్ తో నిమిషాల్లో క్లీన్ చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో వెనిగర్ ఒకటి స్పూన్, బేకింగ్ సోడా మిక్స్ చేసి ఫ్యాన్ బ్లేడ్లపై అప్లై చేయాలి.

దాని తర్వాత ఐదు నిమిషాల తరువాత తడి కాటన్ క్లాత్ తో బాగా శుభ్రం చేయాలి.ఫ్యాన్ రంగు కూడా చెక్కుచెదరకుండా ఉండాలి అంటే.ముందు ఫ్యాన్ రెక్కలను గుడ్డతో తుడవాలి. దాని తర్వాత వాటిపై ఆలివ్ ఆయిల్ రాయాలి. కొన్ని నిమిషాల తర్వాత దాని రెక్కలను కాటన్ గుడ్డుతో శుభ్రం చేయాలి. అప్పుడే ఇది మెరిసేలా మారుతుంది.మీరు సబ్బును,
బేకింగ్ సోడాను కూడా ఉపయోగించి ఫ్యాన్లను శుభ్రం చేయొచ్చు. ముందు బేకింగ్ సోడా,సబ్బును బాగా కలపాలి. ఏదైనా ఒక గుడ్డ లేక స్పాంజితో ఫ్యాను శుభ్రం చేయాలి.ఫ్యాన్ రెక్కలకు దుమ్ము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని మనం పీల్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని కచ్చితంగా శుభ్రం చేస్తూ ఉండాలి..
