Atmosphere: అసలు ఏంటి ఈ వాతావరణం?.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే?
ప్రధానంగా ఇప్పటి కాలంలో వాతావరణం అనేది తీవ్ర ప్రభావం చూపుతుంది. కొంచెం సేపు వర్షపాతం మరికొంచెం సేపు భారీ ఉష్ణోగ్రతతో ప్రజలు కూడా విలవిలలాడిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఏకంగా రైతులయితే తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడుతున్నాయి. అలాగే పంటలు వేసే సమయంలో వర్షాలు పడకపోవడం తొ పాటు చాలా మంది రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం భారత్ లో వాతావరణ సంస్థ రుతుపవనాలపై అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఇందులో చాలానే చెప్పుకొచ్చారు వీళ్ళు. ఋతుపవనాల సీజన్లో స్పష్టమైన మార్పులు కనిపించాయని ఈ క్లైమేట్ సంస్థ చెప్పుకొచ్చింది. ఈ యొక్క వాతావరణ మార్పులు అనేవి వర్షాలు పడేటువంటి స్థితిగతులను పూర్తిగా మార్చినట్లు వెల్లడించారు. తద్వారా మనకి పడాల్సిన చోట వర్షాలు అనేవి భారీ ఎత్తున పడుతున్న మరోచోట అసలు వర్షాలు పడకుండా విపరీతంగా ఎండలు కాస్తూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా వాతావరణ ప్రకృతినే కారణమని వీళ్లు చెప్పకొచ్చారు.
158 జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే 48 జిల్లాలలో అతి భారీ వర్షాలు పడి ప్రజలకు కొంతమేర నష్టం కలిగించాయని చెప్పారు. 178 జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదు అయిందని అలాగే 11 జిల్లాల్లో అసలు వర్షమే పడలేదని ఈ నివేదిక వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే మనం దేశమంతటి కూడా వివిధ వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అర్థమవుతుంది. అయితే వీటన్నిటికి కూడా ప్రకృతి వల్లనే ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చెందాయని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే గత ఐదేళ్ల కన్నా ఈ ఏడాదిలో చాలా మార్పులు సంభవించాయని ఈ క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ వెల్లడించింది. చాలా సందర్భాల్లో పడాల్సిన వర్షం కన్నా అధిక వర్షాలు పడ్డాయని వెల్లడించారు. అంతేకాకుండా వీటన్నింటికి కూడా వాతావరణ పరిస్థితులు కారణమని చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో భారీ వరదలు అలాగే భారీగా నష్టం కూడా వాటిల్లింది చెప్పకువచ్చారు. ఈ ఒక్క ఏడాదిలోనే 753 వాతావరణ కేంద్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయిందని చెప్పుకొచ్చారు. 2020 తర్వాత ఇది అత్యధికమని చెప్పారు.
భూమి ఉపరితల మరియు సముద్ర గర్భంలోని ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాచారం ఉండడమే ఈ వాతావరణం ప్రభావితం చెందిందని చెప్పుకోవచ్చారు. సముద్ర గర్భంతో పోలిస్తే భూమిపై ఎక్కువగా ఉష్ణోగ్రతలనేవి మారిపోతూ ఉంటాయి. ఇలా వాతావరణం మార్పులు వల్ల అలాగే క్రమంగా ఉష్ణోగ్రతలనేవి అటు ఇటు మారిపోవడం వల్ల ఋతుపవనాలు సైతం గతి తప్పుతున్నాయి. దీనివల్ల కురవాల్సిన చోట వర్షం పడకుండా అలాగే పడాల్సిన చోట అత్యధికంగా వర్షపాతం అనేది పడడం వల్ల అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డారు.
ఇకపోతే 2023లో కరువు పరిస్థితులనేవి ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఏడాదిలోని మళ్లీ ఇంతటి భారీ వర్షాలు నమోదు అవ్వడం అందరిలోనూ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. సాధారణంగా వాతావరణం అలాగే ఋతుపవనాలపై ఆధారపడి వ్యవసాయదారులు చాలామంది ఉన్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి రుతుపవనాలు పూర్తిగా గజ తప్పితే ఊహించని పరిణామాలు ఏర్పడతాయని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ వ్యవస్థాపకరాలు తెలిపారు.