Total solar eclipse : సూర్యగ్రహణం చీకట్లోకి ఒకేసారి మూడు రాకెట్లు పంపిస్తున్న‌ నాసా.. దేనికీ పరిశోధన..?

Total solar eclipse : సూర్యగ్రహణం చీకట్లోకి ఒకేసారి మూడు రాకెట్లు పంపిస్తున్న‌ నాసా.. దేనికీ పరిశోధన..?

Total solar eclipse : 2024వ సంవత్సరంలో మొదటగా ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం అనగా ఒక ఖగోళ సంఘటన ఇది. ఇది ఏర్పడినప్పుడల్లా ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మాత్రం అన్ని దేశాలలోని ప్రజలు చూడటం వీలు కాదు. కొన్ని దేశాలలోని ప్రజలు మాత్రమే దీనిని చూడగలరు.

భారతదేశంలోని ప్రజలు  ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణాన్ని తిల‌కించేందుకు కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఉన్నారు.    

ఈ అరుదైన అవకాశాన్ని స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అమెరికాలోని ప‌రిశోధ‌న సంస్థ నాసా సిద్ధ‌మైంది. సూర్యగ్రహణాల కారణంగా భూ వాతావరణంలో కలిగే మార్పులపై పరిశోధనలు చేపట్టబోతుంది. సూర్యగ్రహణ చీకట్లోకి మూడు రాకెట్లను పంపి స్టడీ చేయబోతున్నారు..

70 -2

ఏప్రిల్ 8వ తేదీ రోజు సంభవిస్తున్న సంపూర్ణ సూర్యగ్రహణం చీకట్లోకి రాకెట్లను పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సిద్ధంగా ఉంది. గ్రహణ టైంలో భూమి వాతావరణం పై పొరల్లో ఏర్పడనున్న మార్పులను కనిపెట్టటం కోసం ఈ రాకెట్లలో ముఖ్యమైన సైన్స్ ఉపకారణాలను పంపిస్తుంది.

గ్రహణ టైంలో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు సరిగ్గా అడ్డం వచ్చినప్పుడు పూర్తిగా చీకటి ఏర్పడిన టైంలో అమెరికా నాసా 3 రాకెట్ల ను ఒకేసారి పంపుతుంది. అందులో ఒక దానిని మాత్రం అమెరికా నుండి మిగతా రెండిటిని మాత్రం మెక్సికో, కెనడా నుండి ప్రయోగించడానికి ఏర్పాట్లు చేశారు.

సాధారణంగా భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడు కిరణాలు కొంచెం కొంచెంగా ప్రసరిస్తూ మధ్యాహ్నం టైం కి తీవ్రస్థాయికి చేరతాయి.మళ్లీ సాయంత్రానికి ప్రసారం మెల్లగా ఆగిపోతుంది. అలాకాక  తీక్షణంగా ఉన్న టైంలో ఒక్కసారి సూర్య రశ్మి ఆగినట్లయితే వాతావరణ పొరల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయి అన్న అంశాలను నాసా శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు..

మన వాతావరణం సూర్యకిరణాల్లోని రేడియేషన్ ను అడ్డుకుంటుంది.ఈ టైంలో వాయువులు రేడియేషన్ కు గురి అయినట్లయితే అవి వేడెక్కి వాటిలోని ఎలక్ట్రాన్లు విడిపోతాయి. దీనివల్ల వాతావరణం పై పొర విద్యుత్ ఆవేశితంగా మారుతోంది. భూమి అటువైపు తిరిగినప్పుడు ఆ ప్రదేశంలో సూర్యకిరణాలు పడవు కావున వాతావరణ పై పొర మళ్లీ సాధారణ స్థితికి చేరుతుంది.

70 -1

అయితే ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ కాబట్టి పరిశోధనలు చేయటం చాలా కష్టం. పూర్తిస్థాయిలో సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అనేది తాజా ప్రయోగం ద్వారా నాసా గుర్తించనుంది.అమెరికా ప్రయోగించబోయే మూడు రాకెట్లు గరిష్టంగా 260 మైళ్ళు అంటే 420 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి.

ఈ రాకెట్ ఛార్జ్ న్యూట్రల్ పార్టికల్ డెన్సిటీతో పాటు చుట్టుపక్కల విద్యుత్ అయస్కాంత  క్షేత్రాలను స్టడీ చేస్తాయి.గ్రహణం రోజున కొన్ని నిమిషాల పాటే వాతావరణంలోకి రేడియేషన్ ప్రభావం ఉంటుంది.భూ వాతావరణంలో పలు మార్పులు కొనసాగుతాయి.

రాకెట్ల ద్వారా ప్రయోగించే సైన్స్ ఎక్విప్మెంట్స్ నాసా ఇప్పటికే సాటిలైట్స్ తో అనుసంధానం చేసింది.ప్రయోగ సమయంలో గుర్తించే అంశాలను వెంటనే సాటిలైట్లు నాసా కేంద్రానికి అందిస్తాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?