Washing mechines : ఇది మీకు తెలుసా.. వాషింగ్ మిషన్ కూడా గ్యాస్ సిలిండర్‌లా పేలుతుంది..
వాషింగ్ మిషన్ పేలడం ఏమిటి అని. ఇలా వాషింగ్ మిషన్ పేలడం తో భయాందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటివరకు ఇలా వాషింగ్ మిషన్ పేలలేదని మొదటిసారిగా చూడటం అని పలువురు చెప్పుకుంటున్నారు. మన శ్రమను తక్కువ చేసే యంత్రాలు కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కూడా కారణం అవుతాయి. ఓ వస్తువు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దీని వలన ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లక్నోలో ఓ మహిళ వాషింగ్ మిషన్ వాడుతున్న టైమ్ లో షాక్ కు గురై ప్రాణాలు విడిచింది..
వాషింగ్ మిషన్ ఉపయోగిస్తున్న టైం లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ఎంతో మందికి అవగాహన కల్పించాలి అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలను పాటించడం వలన ఇలాంటి ప్రమాదాలు జరగవు అని చెబుతున్నారు. వారు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వాషింగ్ మిషన్ లు వాడటం చాలా సులభం. కానీ కొన్నిసార్లు వాషింగ్ మిషన్ ను వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వలన ప్రాణాంతకం కావచ్చు. మనలో చాలామంది తనలో ఓ చిన్న ఎలక్ట్రిషన్ ఉన్నాడు అని భావిస్తూ ఉంటాము. ప్లగ్ లు ఫిట్ చేయడం లాంటివి పనులు చిటికెలో చేస్తాము అనే ధీమా ఉంటుంది.
అయితే వాషింగ్ మిషన్ లు,రిఫ్రిజిరేటర్లు వంటి సున్నితమైన వస్తువులను రీ పేర్ చేయడం లాంటి వాటిలో వేలు పెట్టకపోవటమే చాలా మంచిది. ముఖ్యంగా వాషింగ్ మిషన్ల కు సంబంధించినటువంటి ఏమైనా వైర్లు తేగినట్లు గనుక మీకు అనిపిస్తే వెంటనే దానికి సంబంధించిన టెక్నీషియన్ ను పిలవండి ఇంకా ఎప్పటికప్పుడు ప్లగ్ కు సంబంధించినటువంటి వైర్లను కూడా చెక్ చేస్తూ ఉండండి.
ఏవైనా తెగినట్లు గుర్తిస్తే మీరు వెంటనే మార్చుకోండి. లేకపోతే వాషింగ్ మిషన్ లు విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం ఉంటుంది.. వాషింగ్ మిషన్ వాడుతున్నప్పుడు నీరు నియంత్రణ ప్యానేల్స్ పై పడకూడదు. యంత్రాన్ని నియంత్రించే బటన్ లపై చాలాసార్లు నీరు పడుతూ ఉంటుంది.
కాబట్టి ఈ అంశంపై శ్రద్ధ చుపకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాషింగ్ మిషన్ ను ఎప్పుడు కూడా అనుభవజ్ఞుడైన సాంకేతిక నిపుణులతోనే రిపేర్ చేయించుకోవాలి. అనుభవం లేని సాంకేతిక నిపుణులు కొన్నిసార్లు యంత్రంలో ఉన్నటువంటి వైర్లకు టేప్ చేయడం మర్చిపోతూ ఉంటారు.
అంతేకాక కొన్నిసార్లు మోటార్ స్క్రూలు కూడా బిగించటం మర్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో వాషింగ్ మిషన్ ను వాడుతున్నప్పుడు ప్రమాదాలు పెరుగుతాయి. ఇంకా వాషింగ్ మిషన్ ను కూడా క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేస్తూ ఉండండి. దాని తర్వాత చిన్న చిన్న రిపేర్లు పెద్దవిగా కాకముందే ఈ సమస్యలను పరిష్కరించాలి..