water proof phone : ఇకపై ఫోన్ నీళ్లలో పడ్డ నో టెన్షన్.. వాటర్ ప్రూఫ్ ఫోన్ వచ్చేసిందిగా..
ఈ హ్యాండ్ సెట్ ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ చేసే అవకాశం ఉన్నది. దీని గురించిన పూర్తి వివరాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఐపీ 69 రేటింగ్ కు సపోర్ట్ ఇచ్చే ఈ డివైస్ డేస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ గా వస్తుంది.ఒప్పో A3 ప్రో డిస్ ప్లే వాటర్ ప్రూఫ్, ఫాల్స్ కు రెసిస్టెంట్ అని కంపెనీ వారు తెలిపారు. ఒప్పో సూపర్ డ్యురబుల్ అని తెలిసింది..
5 జీ చీప్, మీడియా టెక్ 7050 ప్రాసెసర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. 12 జీబీ రామ్,512జీబీ వరకు స్టోరేజ్ తో ఇది వస్తుంది. ఒప్పో A3 ప్రోలో ట్రిఫుల్ రియల్ కెమెరా సెట్ అప్ ఉంది అని టీజర్లు కూడా సూచించాయి. ఈ డివైస్ బ్యాక్ సైడ్ 64 ఎంపీ ఎఫ్/1.7 ప్రైబరీ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది..
కెమెరా సెటప్ కు సంబంధించినటువంటి మిగిలిన వివరాలు ఇంకా తెలియలేదు.రాబోతున్న చైనా లంచ్ పై కంపెనీ ప్రెసిడెంట్ బో లియు మాట్లాడారు. ఒప్పో డ్యురబుల్ టెక్నాలజీ ఏ సిరీస్ లో మొదలైంది. ఒప్పో A3 ప్రో అనేది మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్. లాంగ్ బ్యాటరీ లైఫ్ తో ప్రపంచంలోనే మొట్టమొదటిగా పూర్తిస్థాయి వాటర్ ప్రూఫ్ ఫోన్ అని తెలిపారు.
ఈ కొత్త ఫోన్ యూజర్ ఫ్రెండ్లీ ఫోన్ లలో ట్రెండ్ సెట్ చేస్తుంది. అంతేకాక మొబైల్ పరిశ్రమలు కూడా మరింత అభివృద్ధి చేస్తుంది అని అన్నారు. అదనంగా ఒప్పో A2 ప్రో నుండి నాలుగు సంవత్సరాల బ్యాటరీ వారంటీని కూడా మీకు అందిస్తున్నట్లుగా తెలిపారు..