WhatsApp: వాట్సప్ మరో న్యూ ఫీచర్... వాట్సప్ చాట్ జాబితాలో ఈ మూడింటిని పిన్ చేయవచ్చు... అది ఎలా అంటే..!!
దీన్ని గ్రూప్ చాట్ లేదా ప్రైవేట్ చాట్ కోసమైనా వినియోగదారులను వాడుకోవచ్చు. మల్టిపుల్ మెసేజ్ ఉన్న గ్రూపు ఉంటే వాటిని కూడా పిన్ చేసుకోవచ్చు.. ఇలా చేయడం వల్ల వాట్స్అప్ ఓపెన్ చేసిన వెంటనే ముందుగా అవే కనపడుతూ ఉంటాయి.
ఈ చాట్ ని ముందుగా పిన్ చేయడానికి చాట్ అప్లికేషన్ కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పిన్ చేయాలనుకుంటున్న మెసేజ్ పై టాప్ చేయాలి. మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేసిన తర్వాత పిన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. చాట్ ఎగువన సందేహాలు కనపడుతూ ఉంటాయి.
ఇది మొబైల్ వర్షన్ లేదా డేస్క్ టాప్ వర్షన్ కు సుమారు ఒకే విధంగా ఉంటుంది. ముందుగా మెసేజ్ బై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఈ విధంగా పిన్ చేసుకోవచ్చు.
మూడింటిని పిన్ చేయొచ్చు; దీనికి సంబంధించిన మూట సి ఈ ఓ జూకర్ బర్గ్ ఇటీవల తన వాట్స్అప్ ఛానల్ లో స్క్రీన్ షాట్ కూడా షేర్ చేయడం జరిగింది. ఒక మెసేజ్ ను చాలా కాలం వరకు పిన్ చేయొచ్చు. సాధారణంగా ఏదైనా మెసేజ్ వస్తే చాట్ లేదా గ్రూప్ మెసేజ్ వస్తే దానిని చూడానికి కిందికి స్క్రోల్ చేయవలసి ఉంటుంది.
అయితే ఈ పిన్ ఆప్షన్ వల్ల అటువంటి అవసరం రాదు. పిన్ చేసిన చాట్ మెసేజ్ టాప్ లో ఉంటాయి. మీరు కచ్చితంగా ఈ మూడు పెట్టుకోవాలన్న నిబంధన ఏమి లేదు. ఒక చాట్ లేదా రెండు చాట్ మెసేజ్ లు పిన్ చేసుకోవచ్చు. సుమారు మూడింటికి వరకే లిమిట్ ఉంటుంది.
ఎలా పిన్ చేసిన మూడు ప్రధానమైన మెసేజ్ పైన కనపడుతూ ఉంటాయి. ఈ మెసేజ్ కు అదనంగా ఫోటోలు పోల్స్ రెండిటిని పెంచేసుకోవచ్చు.. ఈ పిన్ చేసిన సందేహాలను 24 గంటలు ఏడు రోజులు లేదా 30 రోజులపాటు ఉంచుకోవచ్చు.. దీనికి టైం పీరియడ్ మీరే ఎంచుకోవచ్చు.