Sepak Takra Competitions: నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 24 (క్విక్ టుడే) : నల్లగొండ పట్టణంలో అట్టహాసంగా సెపక్ తక్రా పోటీలో ప్రారంభమయ్యాయి. ఎన్జీ స్టేడియంలో ఖేలో తెలంగాణ వరల్డ్ హిందూ లైన్స్ ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంటు స్థాయి సపక్ తక్రా క్రీడలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలను వరల్డ్ హిందూ లైన్స్ వ్యవస్థాపకులు, బిజెపి జాతీయ ఓబిసి సోషల్ మీడియా నెంబర్ పెరిక సురేష్ ప్రారంభించారు.. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారు. 250 కి పైగా సెపక్ తక్రా క్రీడాకారులు వచ్చారు. జూనియర్ సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మీడియాతో మాట్లాడుతూ కెలో ఇండియా, ఖేలో తెలంగాణ జీతో నల్లగొండ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతకి చదువుతోపాటు క్రీడల్లో కూడా పోటీ తత్వం పెంచాలని లక్ష్యంతోని మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు, వారి సూచనలపై నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. క్రికెట్ తో పాటు ఇతర ఆటలు ప్రోత్సాహానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.

ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ ఎంపీ రాజ్యసభ మెంబర్ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కే లక్ష్మణ్ కూడా ప్రోత్సహికరం ఇచ్చారని అన్నారు. ఇన్ని టీములు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది అని, క్రీడలతో పాటు మేము హెల్త్ క్యాంపులు అన్నదాన కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరుణాకర్ రెడ్డి, ఎస్ అర్ ప్రేమ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డీ వైఫ్ ప్రెసిడెంట్, జితేందర్ నాథ్, ఉపేంద్ర, మల్లేష్, జగన్నాతా స్వామి పాల్గొన్నారు.