క్విట్ టుడే న్యూస్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్ లో ఒక ఆసక్తికరమైన రోబో డాగ్ ను ప్రవేశపెట్టారు. ఇది క్రికెట్ చూస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంది. మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో అలాగే టాస్ సందర్భంలో క్రికెట్ ప్లేయర్లతో సరదాగా గడిపేస్తూ ప్రతి ఒక్కరి మనసులను దోచేసింది. ఐపీఎల్ లో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఆటగాళ్ల వద్దకు వెళ్లడం, వారికి షేక్ అండ్ ఇవ్వడం అలాగే వారి ముందు డాన్స్ వేస్తూ చిలిపి పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ రోబో డాగ్ ఏ కనిపిస్తుంది. అయితే తాజాగా దీని పేరు
చంపక్ గా నామకరణం చేయడం జరిగింది . ఇక ఈ రోబో విషయానికి వస్తే చాలా వేగంగా నడవగలదు అలాగే పరిగెత్తగలదు. వ్యాయామాలు, జంప్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇక దీని తల ముందు భాగంలో కెమెరా ఉంచడంతో ప్రేక్షకులు అద్భుతమైన వీక్షణలను కూడా చూయిస్తుంది.
.jpeg)