MI Vs DC IPL 2024 : హోమ్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీ ఘనవిజయం.. ముంబై ఖాతాలో మరో పరాజయం.
ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్దేశిత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టటానికి 257 పరుగులు చేసింది. అనంతరం 258 లక్ష్య చేధనతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో 9 వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది.
బ్యాట్ తో విధ్వంసం సృష్టించిన ఢిల్లీ...
ఢిల్లీ వేదికగా అరుణ్ స్టేడియంలో ఇటీవల జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన ఢిల్లీ బ్యాటర్స్ విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మరియు అభిషేక్ పోరెల్ తొలి బంతి నుండే విధ్వంసం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ మొదటి ఓవర్ లోనే ఏకంగా 19 పరుగులు సాధించింది.

ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ వేసిన ఓవర్లో జెక్ ఫ్రెజర్ ఒక సిక్స్ 2 ఫోర్ల తో 18 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఓవర్లో కూడా ఫ్రెజర్ 18 పరుగులు సాధించాడు. దీంతో మూడు ఓవర్లకే ఢిల్లీ స్కోర్ 55 పరుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే జెక్ ఫ్రెజర్ కేవలం 15 బంతుల్లోనే ఆప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ విధంగా జ ప్రెజర్ అద్భుతం ఆడడంతో పవర్ ప్లే 6 ఓవర్లు ముగించేసరికి ఢిల్లీ 92 పరుగులు సాధించింది.
ఇక పవర్ ప్లే లో అత్యధిక రన్స్ చేసిన మూడో బ్యాటర్ గా ఫ్రెజర్ రికార్డు సృష్టించాడు. ఈ విధంగా ప్రెజర్ 27 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సులతో 84 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పోరెల్ కూడా 27 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్స్ తో 36 పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 12 ఓవర్లలోనే ఢిల్లీ స్కోర్ 150 పరుగుల వద్దకు చేరింది.అనంతరం బరిలో దిగిన సై హోప్ మరియు పంత్ దూకుడుగా ఆడి ఢిల్లీ జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే రిశాబ్ పంత్ 19 బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్ లు తో 29 పురుగులు సాధించగా, సై హోప్ 17 బంతుల్లో 5 సిక్స్ లతో 41 పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు. ఈ నేపథ్యంలోనే 180 పరుగుల వద్ద ఢిల్లీ వికెట్ కోల్పోయింది.అనంతరం బరిలో దిగిన అక్షర్ పటేల్ 6 బంతుల్లో 11 పరుగులు సాధించగా 20 ఓవర్ మూగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్లు నష్టపోయి 257 పరుగులు చేసింది .
లక్ష్య చేధనలో పోరాడి ఓడిన ముంబై...
అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ కి ఏ విధంగాను కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ మొదట్లోనే కీలక వికెట్లు కోల్పోగా తీవ్ర నష్టంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ మరియు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పోరాడే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్ లతో 46 పరుగులు సాధించాడు. ఇక తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శనతో కేవలం 32 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్ లతో 63 పరుగులు సాధించాడు. అనంతరం టీమ్ డేవిడ్ 17 బంతులల్లో 37 పరుగులు చేయడం తో ముంబై టీమ్ 247 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై నిర్ధేషిత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 10 పరుగుల తేడా తో పరాజయం పొందింది. దీంతో హోమ్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీ ఘన విజయం సాధించింది.