cricket commentators : క్రికెట్ కామెంటేటర్స్ సంపాదన ఎంతో తెలుసా...? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక ఆట జరుగుతుంది అంటే దాన్ని మనం ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉంటాం. ఆటలు అనేవి కేవలం మన భాషలోనే జరగవు కాబట్టి అలాగే మన ప్రదేశంలో జరగవు కాబట్టి దాని గురించి మనకి వివరంగా చెప్పేది ఒక కామెంటేటర్ మాత్రమే. అలాంటి కామెంట్ లెటర్ జీతం ఏకంగా స్టార్ క్రికెటర్ అంత ఉంటుందని వారితోపాటు అంతే సమానంగా ఉంటుందని ఆకాష్ చోప్రా వెల్లడించాడు.
ప్రస్తుతం మనం ఈ కామెంటేటర్స్ నీ సాధారణంగా క్రికెట్లో లేదా కబాడీ లోనో చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఎంతగానో వీక్షించేటువంటి ఐపీఎల్ కానీ లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ లేదా కబాడీ మ్యాచెస్ ఇవన్నీ కూడా మనకి బాల్ టూ బాల్ లేదా పాయింట్ టు పాయింట్ వివరంగా తెలియాలంటే దానికి ముఖ్య పాత్ర వహించేది కామెంటేటర్స్.
అలాంటి ఆ కామెంటేటర్స్ వాయిస్ కూడా మనకి అంతలా అర్థం చేసుకుని అంతలా ఇష్టపడుతూ ఉంటాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచెస్ లలోని కామెంటేటర్స్మనకి ఎంతగానో చక్కగా వివరిస్తూ మన లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఉదాహరణగా మన భారతదేశంలో ఎక్కువగా పేరు పొందిన కామెంటేటర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మన భారతదేశంలో మనకి తెలిసినటువంటి కామెంటేటర్స్చాలామంది ఉన్నారు. ఇప్పుడు భారతదేశమంతటా ఇంగ్లీషులో చెప్పడానికి మాజీ క్రికెట్ ప్లేయర్లు సైతం ఈ కామెంటేటర్స్ లిస్టులో ఉన్నారు. ఉదాహరణకి ఆకాష్ చోప్రా, రవి శాస్త్రి, ఇర్ఫాన్ పఠాన్ వీరందరూ కూడా ఒకప్పుడు క్రికెట్ ఆడిన వాళ్లే. ప్రస్తుతం ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగిన సరే మన భారతదేశం తరపున వీళ్ళు కామెంట్రీ లు చెబుతూ ఉంటారు. వీరందరూ కూడా ఒకప్పుడు క్రికెట్ ఆడటం వల్ల ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా వీళ్లు క్రికెట్ ప్రేయర్స్ అనే అర్థమవుతుంది.
అయితే వీళ్ళు ఒక మ్యాచ్ జరిగిన అంతసేపు కూడా అక్కడే ఉండి వాటి గురించి క్లుప్తంగా మనకు వివరిస్తూ ఉంటారు. మరి ఇంతలా కష్టపడి వీరు మనకి కామెంట్రీ వినిపిస్తున్నప్పుడు వీళ్ళ గురించి కూడా మనకి కొన్ని డౌట్స్ ఏ వచ్చి ఉంటాయి. మరి వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో మనకి ఫ్రీగానే మన లాంగ్వేజ్ లో మనకి తెలియజేస్తున్నారా లేదా వీళ్ళు కూడా పెద్ద మొత్తంలో మనీ తీసుకుంటారని డౌట్లు అందరిలోనూ ఉంది. కాబట్టి వీరికి కూడా ఎంత ఇస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తాజాగా కామెంట్రీలలో ఒకడైన ఆకాష్ చోప్రా ఒక మ్యాచ్ కి కామెంట్రీ చేస్తే ఎంత డబ్బు ఇస్తారనేది తెలియజేశాడు. అయితే ఈయన చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద వైరల్ గా మారాయి. తాజాగా ఓ క్రికెట్ మ్యాచ్ ఆడితే స్టార్ ప్లేయర్లు అయినటువంటి వారితో సమానంగా డబ్బును ఇస్తారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు క్రికెట్ పరంగా చూస్తే స్టార్ ప్లేయర్ లేనటువంటి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లాంటి వారికి ఎంత మనీ ఇస్తారో అంతే డబ్బు మాక్కూడా ఇస్తారని చెప్పాడు.
అయితే సాధారణంగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ లేదా బుమ్రా ఇలాంటివారు ఆడుతున్నప్పుడు వారికి మ్యాచ్కి దాదాపు 10 నుంచి 15 లక్షలు వరకు ఉంటుంది. అయితే ఇంతే మొత్తంలో దాదాపు 10 లక్షలు గా కామెంట్రీలకు ఇస్తారని ఆకాష్ చోప్రా వెల్లడించాడు. దీంతో ఇంత డబ్బు కామెంట్రీ గా అందుతుందా అని యావత్ క్రికెట్ ఫ్యాన్స్ అలాగే ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐపిఎల్ మ్యాచెస్ లో కూడా ఎంతోమంది మన తెలుగు కామెంటీర్లు ఉన్నారు. వీరికి దాదాపుగా ఎంతమంది వస్తుందో తెలియదు కానీ పెద్ద మొత్తంలోనే వస్తుందని అర్థం అవుతుంది. అయితే ప్రస్తుతం మన తెలుగులో కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇందులో తెలుగు క్రికెటర్ అయినటువంటి కామెంట్టర్ కూడా ఉన్నాడు. అతనే అంబటి రాయుడు. అంబటి రాయుడు కూడా ఎన్నో మ్యాచెస్ కి కామెంట్రీ చెప్పాడు. అలాగే మన తెలుగు కామెంట్రీలకు వస్తే చాలామంది ఉన్నారు. వాళ్ల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం మన తెలుగులో కామెంట్రీ చెప్పేవాళ్లు వేణుగోపాలరావు, ఎమ్మెస్కె ప్రసాద్,కళ్యాణ్ కృష్ణ, తిరుమల శెట్టి సుమన్, జ్ఞానేశ్వర్ రావు,రాకేష్, డేనియల్,శశికాంత్,ఆనంద్,రవిఇలా కొంతమంది ఉన్నారు. అలాగే లేడీ క్రికెటర్ అయినటువంటి మిథాలీ రాజ్ కూడా అప్పుడప్పుడు కామెంట్రీ చెప్తుంటారు. ఇలా వీరికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు అనేది అందుతుంది.
అయితే ఫేమస్ అయినటువంటి ఆకాష్ చోప్రా, రవి శాస్త్రి ఇలాంటివారు కేవలం కామెంట్రీ తోనే కాకుండా వేరే విధాలుగా ఎన్నో రకాలుగా మనీ అనేది సంపాదిస్తారు. కాబట్టి వీరు నెల తిరగకుండా అనే ఎన్నో కోట్లను సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి కామెంట్రీ కి కూడా డబ్బు అనేది పెద్ద మొత్తంలోనే అందుకోవచ్చు అని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది.
ప్రస్తుతం రవి శాస్త్రి, ఆకాష్ చోప్రా, సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్ కూడా కామెంట్రీ లు చెబుతూ తమకంటూ ప్రత్యేకమైనటువంటి ముద్రను వేసుకుంటున్నారు. దాంతో వీరు క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి స్థాయి కి ఎదగడానికి గల కారణం కామెంటరీ. కాబట్టి ఈ కామెంట్రీ పరంగా కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎంతో డబ్బును సంపాదించుకునే అవకాశం కూడా ఈ కామెంట్రీ పరంగా ఉంది. కాబట్టి క్రికెటర్లకు ఉన్నంత ఫ్రేమ్ అలాగే డబ్బు కూడా సమానంగా ఈ కామెంట్రీ చెప్తున్న వారికి దక్కుతుంది.