IPL 2024 Full Schedule : ఐపీఎల్ 2024 ఫుల్ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ జరిగేది ఆ స్టేడియంలోనే
అయితే... ఈ సంవత్సరం లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అవి కూడా ఏప్రిల్, మే నెలలో జరగనుండటంతో ఐపీఎల్ మ్యాచ్ లకు లోక్ సభ ఎన్నికలు అడ్డంకులుగా నిలుస్తాయని అంతా భావించారు. లోక్ సభ ఎన్నికలు మొదలు కాకముందే తొలి షెడ్యూల్ ప్రకటించారు. ముందు 21 మ్యాచ్ లకు షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ.
తాజాగా మిగితా మ్యాచ్ లకు కూడా షెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండో షెడ్యూల్ వేరే దేశంలో నిర్వహిస్తారని అంతా భావించినా.. భారత్ లోనే ఐపీఎల్ మ్యాచ్ లు మొత్తం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా షెడ్యూల్ ను విడుదల చేసింది.

IPL 2024 Full Schedule : సన్ రైజర్స్ మ్యాచ్ లు ఆ తేదీల్లోనే
ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు అన్నీ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్నాయి. ఇక.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ కూడా చెన్నైలోనే జరిగింది. కాకపోతే అది చిదంబరం స్టేడియంలో. చివరి మ్యాచ్ కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది.
మే 21 వ తేదీన మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. మే 22న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్ లు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగనున్నాయి. మే 24న సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్ టీమ్స్ ను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ లో ముంబై, కోల్ కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉంటాయి. గ్రూప్ బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ టీమ్స్ ఉంటాయి. టాప్ 4 లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి.
మార్చి 26న చెన్నై వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. మార్చి 27న సన్ రైజర్స్ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది. మార్చి 28న రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ, మార్చి 29న బెంగళూరు వర్సెస్ కోల్ కతా, మార్చి 30న లక్నో వర్సెస్ పంజాబ్, మార్చి 31న గుజరాత్ వర్సెస్ హైదరాబాద్, మార్చి 31న ఢిల్లీ వర్సెస్ చెన్నై, ఏప్రిల్ 1న ముంబై వర్సెస్ రాజస్థాన్, ఏప్రిల్ 2న బెంగళూరు వర్సెస్ లక్నో, ఏప్రిల్ 3న ఢిల్లీ వర్సెస్ కోల్ కతా,
ఏప్రిల్ 4న గుజరాత్ వర్సెస్ పంజాబ్, ఏప్రిల్ 5న హైదరాబాద్ వర్సెస్ చెన్నై, ఏప్రిల్ 6న రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు, ఏప్రిల్ 7న ముంబై వర్సెస్ ఢిల్లీ, ఏప్రిల్ 7న లక్నో వర్సెస్ గుజరాత్, ఏప్రిల్ 8న చెన్నై వర్సెస్ కోల్ కతా, ఏప్రిల్ 9న పంజాబ్ వర్సెస్ హైదరాబాద్, ఏప్రిల్ 10న రాజస్థాన్ వర్సెస్ గుజరాత్, ఏప్రిల్ 11న ముంబై వర్సెస్ బెంగళూరు, ఏప్రిల్ 12న లక్నో వర్సెస్ ఢిల్లీ, ఏప్రిల్ 13న పంజాబ్ వర్సెస్ రాజస్థాన్, ఏప్రిల్ 14న కోల్ కతా వర్సెస్ లక్నో, ఏప్రిల్ 14న ముంబై వర్సెస్ చెన్నై, ఏప్రిల్ 15న బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లు జరగనున్నాయి.
అలా మొత్తం ప్లే ఆఫ్ కు ముందే 70 మ్యాచ్ లు జరగనున్నాయి. మే 21న క్వాలిఫైయర్ వన్ మ్యాచ్, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్, మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగనుంది.