IPL 2024 : ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కెప్టెన్లు వీరే.. కెప్టెన్సీ ధోనీ స్థానంలో ఎవరు వస్తున్నారో తెలుసా?
పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ రూ.8.25 కోట్లు తీసుకుంటున్నారు. గత ఏడాది పంజాబ్ జట్టుకు ఒంటిచేత్తో చిరస్మరణీయ విజయాలను ఆయన అందించాడు.
గుజరాత్ టైటాన్స్‌కు సారధ్య బాధ్యతలు చేపడుతున్న హార్డింగ్ పాండ్యా ఈ సారి ముంబై ఇండియన్స్ మారుతున్నారు. గుజరాత్ తిరిగి ఆయనను ముంబైకి అప్పగించినందుకు ఆ జట్టకు రూ.100 కోట్లు చెల్లించినట్లు పలు రూమర్లు వస్తున్నాయి. హార్డిక్ పాండ్యాకు రూ.15 కోట్లు పారితోషికం ఆ ఫ్రాంచైజీ చెల్లిస్తోంది. ఇక గుజరాత్ సారధ్య బాధ్యతలను శుభ్‌మన్ గిల్ తీసుకుంటున్నారు. ఇతను 2022 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి గుజరాత్ జట్టుకు వచ్చారు. ఇతడికి ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ రూ.8 కోట్ల పారితోషికం చెల్లిస్తోంది. ఇక రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు పాప్ డూప్లెసెస్ సారథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ వేలంలో అతడికి రూ.7 కోట్లు పారితోషికం దక్కించుకున్నాడు. ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత డూప్లెసెస్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు.
ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ సారథ్యం వహించనున్నారు. ఐపీఎల్ మినీ వేలంలో పాట్ కమిన్స్‌కు హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 20.50 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రుషభ్ పంత్ మార్పు ఉండకపోవచ్చు. ప్రతి ఏడాది అతడికి ఆ ఫ్రాంచైజీ రూ.16 కోట్లు చెల్లిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారధ్యం వహిస్తున్నారు. ఇతడిని రూ.12.25 కోట్లతో ఆ జట్టు కొనుగోలు చేసింది. గాయం కారణంగా గత ఏడాది ఇతడు సీజన్ ఆడలేదు ఆడలేదు ఈ సీజన్ కు కూడా అతడే మళ్లీ సారధ్య బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం. లక్నో సూపర్ జెంట్స్ తరఫున కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్ల నుంచి ఆ ఫ్రాంచైజీకి అతడు బాధ్యతలు చేపడుతున్నాడు. ఈసారి కూడా ఆ ఫ్రాంచైజీకి అతనే కెప్టెన్‌గా కొనసాగనున్నారు. ఇతడికి రూ.17 కోట్లు ఆ ఫ్రాంచైజీ చెల్లిస్తోంది.