MI vs CSK IPL 2024 : ముంబై vs చెన్నై.. మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు సిద్ధమైన వాంఖాడే..
ఇరు జట్లు కూడా దిగ్గజ జట్లు కావడంతో , వాంఖాడే వేదికగా భారీ స్కోర్ ఖాయమంటున్నారు క్రికెట్ అభిమానులు. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా ముంబై మరియు చెన్నై మ్యాచ్ ను చూడాల్సిందే అని చెబుతున్నారు. అయితే ఐపీఎల్ 2024లో ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో 3 స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది.
అదేవిధంగా వరుస పరాజయాల తర్వాత ఇటీవల జరిగిన ఆర్సిబీ vs ముంబై మ్యాచ్ లో మంచి ఫోర్మ్ లోకి వచ్చిన ముంబై ఇండియన్స్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. అయితే పాయింట్లు పట్టికలో చెన్నై తో పోలిస్తే ముంబై జట్టు వెనుకబడి ఉన్నప్పటికి అంత తక్కువ అంచనా వేయకూడదని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మధ్య పెద్ద ప్లేయర్స్ ఒకరితో ఒకరు గట్టిగానే పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. మరి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ 167.644 స్ట్రైక్ రేటుతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో ఆడిన 5 ఇన్నింగ్స్ లో రోహిత్ సఘటున 31.20 తో 17 ఫోర్లు 10 సిక్స్ లు కొట్టి 156 పరుగులు చేశాడు.
దీంతో చెన్నైతో జరగబోయే మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఊచకోత కోయిస్తాడని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. కానీ సీఎస్.కే బౌలర్ ముస్తాఫిర్ రెహమాన్ రోహిత్ ను అడ్డుకునే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక ముస్తాఫిజర్ ఇప్పటికి 4 ఇన్నింగ్స్ లో 8 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు.
జస్ట్ప్రిత్ బూమ్రా vs శివమ్ దూబే
ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా ఒకరు. అతను వేసే యార్కర్లకు స్టార్ బ్యాటర్స్ సైతం పెవిలియన్ బాట పట్టాల్సిందే. అంతెందుకు ఇటీవల జరిగిన ఆర్సీబీ vs ముంబై మ్యాచ్ లో బుమ్రా 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇక మెగా టోర్ని ఇప్పటివరకు బూమ్రా 10 వికెట్లు దాకా పడగొట్టినట్లు తెలుస్తోంది.
పవర్ ప్లే లో కొత్త బంతులతో డెత్ ఓవర్లలో యార్కర్లతో ఈరోజు సీఎస్.కే బ్యాటర్లను బుమ్రా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు శవమ్ దుబే ఈ సీజన్ లో మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. 160 స్ట్రైక్ రేట్ తో 176 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే శివమ్ మరియు బుమ్రా ల మధ్య పోరు ఆసక్తికరంగా మారబోతుంది అంటూ క్రికెట్ అభిమానులు చెబుతున్నారు
రవీంద్ర జడేజ vs సూర్య కుమార్ యాదవ్...
తొలిసారి ముంబై మ్యాచ్ లో డక్కౌట్ అయిన సూర్య తర్వాత జరిగిన ఆర్సీబీ మ్యాచ్లో మాత్రం కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి స్కై అనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు చెన్నైతో జరగబోయే మ్యాచ్లో సూర్య మరోసారి విజృంభించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు రవీంద్ర జడేజా అతి తక్కువ పరుగులు ఇస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. దీంతో ఈరోజు జరగబోయే మ్యాచ్లో సూర్య మరియు జడేజాల మధ్య ఎవరిది పై చేయి అవుతుందనేది వేచి చూడాలి. అంతేకాక ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ ను ఎక్కువసార్లు ఓడించిన జట్టుగా ముంబై ఇండియన్స్ కు ఇప్పటికే రికార్డు ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ఈ 2 జట్లు ఇప్పటికీ 36 సార్లు పోటీ పడగా దీంట్లో చెన్నై 16 మ్యాచులు, ముంబై 20 మ్యాచ్ లలో విజయం సాధించారు. మరి ఈరోజు జరగబోయే 37వ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారనేది వేచి చూడాలి.