MI Vs DC IPL 2024 : హోమ్ గ్రౌండ్ లో మొదటి విజయం అందుకున్న ముంబైై ఇండియన్స్...
దీనిలో భాగంగా ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకొని బరిలో దిగగా, తోలుతా బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేశారు. అనంతరం 235 పరుగుల లక్ష్య చేదనతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 205 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది.
అనంతరం సూర్యకుమార్ యాదవ్ 2 బంతుల్లో 0 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా , మైదానంలోకి అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 33 బంతులకు గాను 3 ఫ్లోర్లు 1 సిక్స్ తో 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
అలాగే 5 బంతుల్లో 1 ఫోర్ కొట్టి 6 పరుగులతో తిలక్ వర్మ పెవిలియన్ బాట పట్టగా , టీమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సులతో 45 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.ఇక చివరాఖరిలో వచ్చిన రోమారియో షెఫర్డ్ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులు కొట్టి 39 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. లాస్ట్ ఓవర్ లో రొమారియో ఏకంగా 32 పరుగులు చేయడం గమనార్హం.
ఈ విధంగా ముంబై ఇండియన్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా... అనంతరం బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు నష్టానికి 20 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తన మొట్టమొదటి విజయాన్ని హోమ్ గ్రౌండ్ వేదికగా సాధించింది.