Pat Cummins : హైదరాబాద్ జట్టుకు మరో శుభవార్త... పాట్ కమ్మిన్స్ కు దక్కిన అరుదైన గౌరవం...

Pat Cummins : హైదరాబాద్ జట్టుకు మరో శుభవార్త... పాట్ కమ్మిన్స్ కు దక్కిన అరుదైన గౌరవం...

Pat Cummins : సోమవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన SRH మరియు RCB మ్యాచ్లో హైదరాబాద్ 25 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశిత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఏకంగా 287 భారీ స్కోర్ నమోదూ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు సాధించినన టీమ్ గా చరిత్రకెక్కింది. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ తో చేలరేగగా అతనికి క్లాసన్ కూడా తోడు కావడంతో చిన్న స్వామి స్టేడియం వేదికగా  సునామీ సృష్టించారు. అనంతరం 288 భారీ లక్ష్యంతో బరిలో దిగిన RCB హోమ్ గ్రౌండ్ వేదికగా విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

Read Also రోబో డాగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు!

167 -2

దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలిచి ఆనందంలో ఉంది. గత ఐపీఎల్ సీజన్ తో పోలిస్తే  2024 ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ టీమ్ విజృంభించి ఆడుతుందని చెప్పాలి. ఈ నేపధ్యంలోనే 2024 ఐపిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి మరో శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ కు ఇటీవల అరుదైన గౌరవం లభించినట్లుగా తెలుస్తోంది.

కమ్మిన్స్ కు దక్కిన అరుదైన గౌరవం...

ఇప్పటికే వరుస విజయాలతో చాలా ఆనందంగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి మరో గుడ్ న్యూస్ దక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు అరుదైన గౌరవం లభించింది.  2023 విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కమ్మిన్స్ నిలిచాడు. తన జాతీయ జట్టు అయినటువంటి ఆస్ట్రేలియాకు ఐసీసీ వరల్డ్  కప్ అందించడమే దీనికి గల ప్రధాన కారణమని తెలుస్తోంది.

167 -3

ఈ నేపథ్యంలోనే ఆ సంవత్సరం పాట్ కమ్మిన్స్ మొత్తం 42 టెస్ట్ మ్యాచ్లు ఆడగా, ఓ మ్యాచ్లో ఏకంగా 10 వికెట్లను పడగొట్టాడు .దీంతో 2023లో జట్టును అద్భుతంగా డ్రైవ్ చేయగలిగాడని పాట్ కమ్మిన్స్ పేరు మీదుగా ఈ అవార్డు ఎంపిక చేసినట్లు విస్డన్ ఎడిటర్ లారెన్స్ బూథ్ తెలియజేశారు..

అయితే 2012 తర్వాత ఓ ఆస్ట్రేలియా ప్లేయర్ కు ఇంతటి అరుదైన విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అంతకుముందు మైఖేల్ క్లార్క్ అని ఆస్ట్రేలియా ఆటగాడు ఈ అవార్డుకు ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ అరుదైన గౌరవాన్ని SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్ దక్కించుకున్నాడు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?